జాతీయ వార్తలు

విభజన.. యుపిఏ అనాలోచిత నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిడిపి ఎంపీ కింజరాపు ధ్వజం

న్యూఢిల్లీ, నవంబర్ 26: ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి యుపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను విభజించిందని తెలుగుదేశం ఎంపీ కింజరాపురామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజనను కోరుకోలేదని, యుపీ ప్రభుత్వమే విడదీసిందనిన లోక్‌సభలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ విమర్శించారు. యుపీఏ ప్రభుత్వం అనాలోచితంగా రాష్ట్రాన్ని విభజించడంతో ఆంధ్రప్రదేశ్ విపరీతంగా నష్టపోయిందని ఆయన అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు ఎట్టి సమస్యలు లేకుండా ఏర్పడ్డాయని ఆయన అన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ విధానసభ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రం తనకున్న అధికారాలతో బుట్టదాఖలు చేసిందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకుంటే రెండు ప్రాంతాల ప్రతినిధులను కూర్చోపెట్టి పరస్పనర అవగాహనతో చేసి ఉంటే బాగుండేదని ఎంపీ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని అమలు చేసే వారు సమర్ధవంతంగా పనిచేయకపోతే ప్రజలు దుష్ఫలితాలు అనుభవిస్తారన్నదనడానికి ఏపి విభజనే నిదర్శనమని కింజరాపుపేర్కొన్నారు.