జాతీయ వార్తలు

కలసి కాలుష్యాన్ని తరిమికొడదాం:కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్యాన్ని కలిసి తరిమికొడదామని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ పిలుపు వెనుక నేపథ్యం ఇలా ఉంది.. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ప్రధాని మోదీని ‘చౌకీదార్ చోర్‌హై’ అని కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సీఎం కేజ్రీవాల్ మద్దతు ఇచ్చిన విషయం విదితమే. సుప్రీం కోర్టు కేంద్రానికి క్లీన్‌చీట్ ఇవ్వటంతో పాటు రాహుల్‌ని సున్నితంగా మందలించిన విషయం తెలిసిందే. రాహుల్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ ట్విటర్‌లో స్పందిస్తూ రాహుల్‌కి మద్దతిచ్చిన సీఎం కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి డిమాండ్‌పై సీఎం కేజ్రీవాల్ ట్విటర్‌లో సమాధానం ఇస్తూ.. ఇపుడు అందరం కలిసికట్టుగా వాయు కాలుష్యాన్ని అంతమొందించాల్సిన సమయం అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ చేస్తుందని, రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు అందరం కృషి చేయాలని ఇందుకు కేంద్ర మంత్రి జవడేకర్ కూడా సహకరించాలని కేజ్రీవాల్ ట్విటర్ సందేశంలో కోరారు.