మెయిన్ ఫీచర్

జీవితం మన చేతుల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులకి ఇచ్చేది గర్భశోకమా? పరీక్షల్లో ఫెయల్ అయ్యామని, ప్రేమ విఫలమైందనే చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడితే.. పరీక్షలు మళ్లీ వస్తాయ. ప్రేమ మళ్లీ పుడుతుంది. నీలాంటి కొడుకు లేదా కూతురును ఆ భగవంతుడైనా మళ్లీ తెచ్చిఇవ్వగలడా? ఒక్కసారి ఆలోచించండి. మీరు వారికి ఏమీ ఇవ్వకపోయినా బాధపడరు. అల్పమిచ్చినా అనల్పంగా భావించి ఆనందిస్తారు. గర్భశోకాన్ని భరించలేరు.
నేడు పేపర్లలో టీవీల్లో ఏ వార్తల్లో చూసినా ‘విద్యార్థుల ఆత్మహత్యలు’ కని పిస్తున్నా య.ఇందుకు ఏమిటి కారణం?
ఎంతో కష్టపడి చదివి ఐఐటిలో సీటు సంపాదించుకుని తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి ఇంజనీరింగ్‌లో చేర్పిస్తే ఆత్మహత్య చేసుకున్నాడని వార్త వస్తే ఆ తల్లిదండ్రుల మానసిక క్షోభకి అంతం ఉంటుందా? పిల్లలు ఆ పని చేసేటప్పుడు తల్లిదండ్రుల ప్రేమ, అభిమానం, వారి ఆశలు ఏవీ గుర్తుకు రావా?
ఈ లోపం ఎక్కడుంది? బలవంతంగా పిల్లల మీద తమ కోరికలు రుద్దుతున్న తల్లిదండ్రులలోనా? తల్లిదండ్రులని సరిగ్గా అర్థం చేసుకోక వారేదో తమకి విరోధులన్నట్లు భావిస్తూ స్వతంత్రులమయ్యామనుకుంటూ వెనుకా ముందు ఆలోచన లేక ఏమి సాధించాలని ఈ ఆత్మహత్యలు? ఇందువల్ల తమ కోరికలు తీరుతాయనా?
తమకి జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులకి తాము ఇచ్చేది గర్భశోకమా? దయచేసి యువతరం ఆలోచించండి. మీరు వారికి ఏమీ ఇవ్వకపోయినా బాధపడరు. అల్పమిచ్చినా అనల్పంగా భావిం చి ఆనందిస్తారు. గర్భశోకాన్ని భరించలేరు.
కొందరు కోరుకుని అమెరికా వీసా సంపాదించుకుని అప్పులు చేసి డాలర్లమీద ఆశతో వెళ్లి అక్కడి పరిస్థితుల్లో ఇమడలేకనో ఏమో! చెప్పా పెట్టకుండా ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఆ తల్లిదండ్రులు కొడుకు పోయినందుకు ఏడవడానికి తోడుగా లక్షల అప్పులు తీర్చలేక వారూ ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు.
అమెరికా వెళ్లాలని మోజున్నవాళ్ళు అక్కడి పరిస్థితులన్నీ కూలంకషంగా తెలుసుకుని ఆ పరిస్థితులల్లో ఇమడగలం అనుకుంటేనే వెళ్లాలి. వెళ్ళాక కష్టమైనా నిష్ఠూరమైనా సర్దుకుపోయే ప్రయత్నం చేయాలి. తాము పోతే తల్లిదండ్రుల పరిస్థితిని ఆలోచించాలి. ఆలోచించలేని అమాయకపు వయసు కాదు కదా? తమకే అన్నీ తెలుసనుకుని తల్లిదండ్రులకి ఏమీ తెలియదని, తామే మేధావులమనే భావంతో వెళ్లినవారు అక్కడ సర్దుకోలేరా? చచ్చి ఎవర్ని సాధించాలని?
మనిషి జన్మ వచ్చినందుకు సంతోషంతో కష్టాలొచ్చినపుడు కృంగిపోకుండా సుఖాలొచ్చినపుడు పొంగిపోకుండా అన్నింటినీ ప్రశాంతంగా ఎదుర్కొని అనుభవించగలగాలి.
ప్రతి జీవికీ దేవుడు వారి వారి కర్మలని బట్టి ఆయువు నిర్ణయిస్తాడు. అది తీరేవరకూ కష్ట సుఖాలు అనుభవిస్తూ ఆధ్యాత్మికతతో భగవంతుని చేరే ప్రయత్నం చెయ్యాలి.
కాబట్టి భగవంతుడిచ్చిన ఈ మానవ జన్మని సార్థకం చేసుకునే ప్రయత్నం చేయండి. పిరికితనంతో ఆత్మహత్యలకి పాల్పడకండి. మీకు విరక్తి కలిగినపుడు మీకు ఇష్టమైన భగవన్నామాన్ని తలచుకోండి. ఆ దేవుడే దారి చూపిస్తాడు. సమస్యకి ఆత్మహత్య పరిష్కారం కాదని తెలుసుకోండి.

- ఆర్.ఎస్.హైమవతి