జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో హెలికాప్టర్ కూలి ఏడుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మృతుల్లో నవ దంపతులు, మహిళా పైలెట్
కాట్రా (జమ్మూ), నవంబర్ 23: జమ్మూకాశ్మీర్‌లోని కాట్రాలో ఒక హెలికాప్టర్ కూలిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో కొత్తగా పెళ్లయిన జంట, పైలెట్ ఉన్నారు. ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ను ఒక పక్షి ఢీకొనడం వల్ల అగ్నిప్రమాదానికి గురైంది. హిమాలయన్ హెలీ సర్వీసుకు చెందిన హెలికాప్టర్‌లో ఆరుగురు యాత్రికులు ఉన్నారు. త్రికూట్ హిల్స్‌లోని సంజిచాట్ హెలిప్యాడ్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ కాట్రా ప్రాంతంలోని కొత్త బస్టాండ్ వద్ద కూలిపోయిందని జమ్మూ పోలీసు డైరెక్టర్ జనరల్ దినేష్ రాణా వెల్లడించారు. మహిళా పైలెట్‌తో పాటు ప్రయాణికులు ఆరుగురు మృత్యువాతపడ్డారని ఆయన అన్నారు. ఈ దుర్ఘటనపై విచారణకు గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా ఆదేశాలు ఇచ్చారు. ప్రమాదంపై విచారణ జరిపేందుకు డిజిసిఏ కూడా రంగంలో దిగింది. జమ్మూకాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హెలికాప్టర్ రోటర్‌ను పక్షి ఢీకొనడం వల్ల ఇంజన్ పనిచేయడం మానేసిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో జనసమర్థం లేని ప్రాంతంలో హెలికాప్టర్‌ను దించాలని మహిళా పైలెట్ భావించారు. ఈలోగా హెలికాప్టర్ ఇంజన్‌లో మంటలు రాజుకుని కుప్పకూలిపోయింది. మృతుల్లో కొత్తగా పెళ్లయిన జంట ఉందని ఉధంపూర్-రియాసీ రేంజ్ డిఐజి సురేందర్ గుప్తా తెలిపారు. మృతుల వివరాలు అధికారులు వెల్లడించారు. సుమిత్ర విజయన్ (పైలెట్, హైదరాబాద్), అర్జున్ సింగ్, మహేశ్, వందన (జమ్మూ), సచిన్, అఖిత (5), అరణ్యజిత్ (్ఢల్లీ) చనిపోయారు. మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఎర్పాట్లు చేస్తున్నారు.(చిత్రం)కాశ్మీర్‌లో సోమవారం కూలిపోయన హెలికాప్టర్.. మంటలు ఆర్పుతున్న సహాయక సిబ్బంది .. మృతిచెందిన మహిళా పైలట్ సుమిత్ర విజయన్ (ఫైల్ ఫొటో)