జాతీయ వార్తలు

ఉగ్ర ముప్పుపై ఉమ్మడి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్దిష్ట ప్రణాళిక రూపొందిద్దాం
ఆసియాన్ దేశాలకు మోదీ పిలుపు

కౌలాలంపూర్, నవంబర్ 21: ప్రపంచానికే పెను సవాలుగా మారిన ఉగ్రవాదంపై పోరుకు ఆసియాన్ దేశాలతో మరింత సహకారం పెంపొందించుకోవాలన్న అభిలాషను ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. అంతేకాక దక్షిణ చైనా సముద్రంలో సరిహద్దు, నౌకారవాణాకు సంబంధించిన వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సముద్ర రవాణా భద్రత, పైరసీ నిరోధం, మానవతా సాయం, విపత్తుల సహాయంవంటి రంగాల్లో 10 దేశాలకు సభ్యత్వం ఉన్న ఆసియాన్‌తో సహకారానికి నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. ‘ఉగ్రవాదం ప్రపంచ దేశానికే పెను ముప్పుగా తయారవుతోంది. ఇది మన దేశాలన్నిటిపైనా ప్రభావం చూపిస్తోంది. ఆసియాన్ దేశాలతో భారత్‌కు చక్కటి సంబంధాలున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఒక సమగ్రమైన తీర్మానాన్ని ఆమోదించుకోవడం ద్వారా మన సహకారాన్ని ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకెళ్లగలమో కూడా మనం ఆలోచించాలి’ అని మోదీ శనివారం ఇక్కడ ప్రారంభమైన ఆసియాన్- భారత శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ప్రాంతీయ సహకారం విషయంలో ఆసియాన్ ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలవగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
దక్షిణ చైనా సముద్రంలో సరిహద్దు వివాదాలను ప్రస్తావిస్తూ అంతర్జాతీయ చట్టాల సూత్రాలకు అనుగుణంగా స్వేచ్ఛాయత విమాన, నౌకారవాణా, ఎలాంటి అడ్డంకులు లేని వాణిజ్యానికి కట్టుబడి ఉండాలన్న ఆసియాన్ అభిప్రాయాలతో భారత్ ఏకీభవిస్తోందని ప్రధాని అన్నారు. ఈ ప్రాంత దేశాల అభివృద్ధికి కనెక్టివిటీ ఒక ముఖ్యమైన మార్గంగా అభివర్ణిస్తూ ఇండియా- మైన్మార్- థాయిలాండ్ హైవే ప్రాజెక్టు చక్కటి పురోగతి సాధిస్తోందన్నారు. ఎలక్ట్రానిక్ వీసా సదుపాయాన్ని భారత్ త్వరలోనే అన్ని ఆసియాన్ దేశాలకు విస్తరిస్తుందని చెప్పారు. భారత్- ఆసియాన్ సహకారం, ఆర్థిక భాగస్వామ్యంలో సైన్స్, టెక్నాలజీలు ఒక ముఖ్యమైన భాగమని అంటూ, ఆసియాన్- భారత్ శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి నిధిని ఇప్పుడున్న 10 కోట్ల డాలర్ల నుంచి 50 కోట్ల డాలర్లకు పెంచనున్నట్టు చెప్పారు.
జపాన్, చైనా ప్రధానులతో చర్చలు
ఆసియాన్- భారత్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం జపాన్ ప్రధాని షింజో అబేను, చైనా ప్రధాని లీ కెక్వియాంగ్‌లతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. మోదీకి జపాన్ ప్రధాని ఇచ్చిన విందు సందర్భంగా ఇరువురు నేతలు ప్రాంతీయ సమస్యలపైన, ద్వైపాక్షిక అంశాలపైన చర్చలు జరిపారు. ** కౌలాలంపూర్‌లో జరిగిన ఆసియాన్- భారత శిఖరాగ్ర సమావేశానికి ముందు ప్రధాని మోదీని కలిసిన జపాన్ ప్రధాని షింజో అబె **