క్రీడాభూమి

చెలరేగిన జేజె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీపై చెనె్నయిన్ గెలుపు
చెన్నై, నవంబర్ 24: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌ని చెనె్నయిన్ ఎఫ్‌సి 4-0 తేడాతో గెల్చుకుంది. ఢిల్లీ డైనమోస్‌ను ఢీకొన్న ఈ జట్టుకు యువ ఆటగాడు జేజె అండగా నిలిచాడు. అతను రెండు గోల్స్ సాధించి జట్టును విజయపథంలో నడిపాడు. మ్యాచ్ 17వ నిమిషంలో జాన్ స్టీవెన్ మెన్డోజా వలెన్షియా చేసిన గోల్‌తో చెనె్నయిన్ ఖాతా తెరిచింది. మరో నాలుగు నిమిషాలకే బ్రూనో పెలిసరీ గోల్ సాధించాడు. 40, 54 నిమిషాల్లో జేజె గోల్స్‌తో చెలరేగిపోయాడు. ఈ రెండు గోల్స్ సాయంతో చెనె్నయిన్ తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి విజయభేరి మోగించింది. ప్రత్యర్థిని నిలువరించడానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన ఢిల్లీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.