జాతీయ వార్తలు

మాయావతిని క్షమాపణలు కోరిన జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బిఎస్‌పి అధినేత్రి, మాజీ సిఎం మాయావతిపై బిజెపి నాయకుడు దయాశంకర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ తరఫున కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విచారం వ్యక్తం చేశారు. మాయావతిని క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన ప్రకటించారు. మహిళపై నీచమైన పదాన్ని ఉపయోగించడం సరికాదని, దయాశంకర్ వ్యాఖ్యలను పార్టీ తరఫున ఖండిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. కాగా, ఈ వ్యవహారంపై బిజెపి వెంటనే అప్రమత్తమై నష్టనివారణ చర్యలు తీసుకుంది. దయాశంకర్‌ను యుపి బిజెపి ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. వచ్చే ఏడాది యుపి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు పార్టీకి చేటు తెస్తాయని బిజెపి నాయకత్వం ఆందోళన చెందుతూ దయాశంకర్‌పై వేటు వేసింది.