జాతీయ వార్తలు

మాల్యాను వెనక్కి రప్పిస్తాం: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బ్యాంకులకు భారీగా రుణాల ఎగవేత, మనీల్యాండరింగ్ కేసుల్లో నిందితుడైన కింగ్‌ఫిషర్ యజమాని విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం మీడియాకు తెలిపారు. లండన్‌లో తలదాచుకుంటున్న మాల్యాను బహిష్కరించాలంటూ తాము కోరినప్పటికీ బ్రిటన్ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. పాస్‌పోర్టును రద్దు చేసినందున బ్రిటన్‌లో ఇక మాల్యాను ఉండనీయకూడదన్నారు. మాల్యాపై కోర్టులో కేసులు దాఖలు చేయాల్సిందిగా దర్యాప్తు సంస్థలను ఆదేశించామని, అరెస్టు వారంట్లు విడుదలయ్యాక అప్పుడు చట్ట ప్రకారం ఆయనను వెనక్కి రప్పిస్తామన్నారు.