జాతీయ వార్తలు

అజేయ శక్తి పిఎల్‌ఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 1: భద్రతాపరంగా తమకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని ముఖాముఖీ ఢీకొని నిలబడ గలిగే శక్తియుక్తులు తమకు ఉన్నాయని చైనా స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ తీరప్రాంత హక్కుల విషయంలో రాజీపడేది లేదని దక్షిణ చైనా మహాసముద్రంపై చెలరేగుతున్న వివాదాల నేపథ్యంలో మరింత ఘాటుగానే తేల్చిచెప్పింది. ఈ సముద్ర జలాలపై చైనాకు ఏ రకమైన హక్కులు లేవంటూ ఇటీవల ఓ అంతర్జాతీయ ట్రిబ్యునల్ చారిత్రక తీర్పును ఇచ్చినప్పటికీ కమ్యూనిటీ నాయకత్వం ప్రపంచ దేశాలపై కారాలు మిరియాలు నూరుతోంది. తీరప్రాంత హక్కుల రక్షణ, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ, హక్కులను కాపాడుకోవడం వంటివాటి విషయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ)కు ఎదురులేని శక్తి ఉందని రక్షణ మంత్రి చాంగ్ వాంకన్ తెలిపారు. ఎలాంటి ఉపద్రవాన్నైనా తట్టుకుని నిలబడి విజయాన్ని సాధించే సత్తా పిఎల్‌ఏకు ఉందని రక్షణ మంత్రిని ఉటంకిస్తూ చైనా డైలీ తెలిపింది. పిఎల్‌ఏ 89వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. 2.3 మిలియన్ మంది సైనికులతో కూడిన పిఎల్‌ఏ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తి అని స్పష్టం చేశారు. ఇంతటి సుసంపన్నపైన సైనిక బలగం కలిగిన తమకు సంబంధించి అన్ని హక్కులనూ, ప్రయోజనాలను పరిరక్షించుకుని తీరతామని రక్షణ మంత్రి తెలిపారు. అయితే దక్షిణ చైనా మహసముద్ర సమస్యను ఆయన ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, ఆయన ప్రసంగం మాత్రం పరోక్షంగా దానిచుట్టూనే సాగింది.