జాతీయ వార్తలు

వీరు కూడా..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4:పనామా పేపర్స్ భారత సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార ప్రముఖుల్లోనూ అలజడి రేకెత్తిస్తున్నాయి. మొసాక్ ఫోనె్సకా అనే పనామా లా కంపెనీ నుంచి లీకైన లక్షలాది రహస్య పత్రాల్లో వెల్లడైన పేర్లలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు, ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్, రియల్టర్ కెపి సింగ్, ఇండియా బుల్స్‌యజమాని సమీర్ గెహ్లౌట్, ముంబయి మాఫియా మాజీ నాయకుడు ఇక్బాల్ మిర్చీ, గౌతమ్ అదానీ సోదరులు వినోద్ అదానీ సహా మొత్తం 500మంది భారతీయులు ఉన్నారు. అనేక ట్రస్టులు, ఫౌండేషన్లు కూడా ఇందులో ఉన్నట్టు స్పష్టమవుతోంది. వీరందరూ కూడా దేశంలో పన్నులు ఎగవేయడానికి అందుకు వీలు కల్పించే దీవి దేశాల్లో పెట్టుబడుల్ని తరలించినవారేనని ఈ పత్రాలుచెబుతున్నాయి. బిగ్ బిగా పేర్కొనే అమితాబ్ 23ఏళ్ల క్రితం ఏర్పడిన నాలుగు షిప్పింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. వీటి అధీకృత మూలధనం 5వేల డాలర్ల నుంచి 50వేల డాలర్లయితే ఇవి మిలియన్ల కొద్దీ డాలర్ల మేర వ్యాపారం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కంపెనీల పదవులకు అమితాబ్ రాజీనామా చేశారు. తాజాగా వెల్లడైన పత్రాలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయన కోడలు ఐశ్వర్య అమిక్ పార్ట్నర్స్ అనే విదేశీ కంపెనీకి 2005లో డైరెక్టర్‌గా, షేర్ హోల్డర్‌గా పనిచేశారు. 50వేల డాలర్ల అధీకృత మూలధనంతో ఆ కంపెనీ ఏర్పాటయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఐశ్వర్య రాయ్ పేరును ఎ.రాయ్‌గా మార్చారని, అనంతరం డైరెక్టర్‌గా కాకుండా ఆమె హోదాను షేర్‌హోల్డర్‌గా పరిమితం చేసినట్టు ఈ పత్రాలు చెబుతున్నాయి. ఐశ్వర్య కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్న ఆ కంపెనీ 2008లోనే మూతపడిందని ఈ పత్రాల్లో వెల్లడైంది. కాగా, ఈ పత్రాల్లోని వివరాలను ఐశ్వర్య ఖండించారు. వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. డిఎల్‌ఎఫ్‌కు చెందిన కౌశల్ పాల్ సింగ్ బ్రిటీష్ వర్జీన్ దీవుల్లో విల్డర్ లిమిటెడ్ అనే కంపెనీని కొన్నారని, అందులో ఆయన భార్య సహ భాగస్వామిగా ఉన్నారని ఈ పత్రాలు వెల్లడించాయి. 2012లో సింగ్ కుమారుడు, కుమార్తె రెండు కంపెనీలను ఏర్పాటు చేశారని, వాటిలో సన్నిహిత బంధువులందరినీ షేర్‌హోల్డర్లుగా మార్చారని ఈ రహస్య పత్రాలు తెలిపాయి. విదేశీ బ్యాంకుల్లో మేటవేసిన నల్లధనాన్ని స్వదేశానికి రప్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఈ రహస్య పత్రాలు వెల్లడి కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.