జాతీయ వార్తలు

పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్: పాకిస్తాన్‌లో ప్రభుత్వేతర శక్తులంటూ ఎవీ లేవని, పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ నిధులతో సాగుతున్న సీమాంతర ఉగ్రవాదమే ఉందని ముంబయి కోర్టు ఎదుట పాక్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలాలు రుజువు చేస్తున్నాయని బిజెపి అంటూ, పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తమ గడ్డపైనుంచి ప్రభుత్వేతర శక్తులు పని చేస్తున్నాయన్న వాదనద్వారా భారత్‌లో ఉగ్రవాద దాడుల్లో తమ బాధ్యత ఏమీ లేదని పాక్ చాలా కాలంగా చెప్తున్నదంతా అబద్ధమని అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న హెడ్లీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబయి ప్రత్యేక కోర్టు ముందు ఇచ్చిన వాంగ్మూలాలు విస్పష్టంగా రుజువు చేశాయని బిజెపి జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్ నాథ్ సింగ్ శనివారం ఇక్కడ అన్నారు. ‘పాకిస్తాన్‌లో ప్రభుత్వేతర శక్తులు లేవని, కేవలం ఐఎస్‌ఐ నిధులు సమకూరుస్తున్న ఉగ్రవాదం మాత్రమే ఉందని భారత్ మొదటినుంచీ చెప్తోంది. హెడ్లీ స్టేట్‌మెంట్లు ఆ అనుమానాలు నిజమని నిరూపించాయి. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడం ద్వారా ప్రపంచ దేశాల్లో దాన్ని ఏకాకిని చేయడానికి దౌత్యపరమైన చర్యలు ప్రారంభించడానికి భారత ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
గుజరాత్(2004)లో పోలీసులు కాల్చి చంపిన లష్కరే తోయిబా టెర్రరిస్టు ఇషత్ జహాన్ గురించి హెడ్లీ కోర్టు ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్లను సింగ్ ప్రధానంగా ప్రస్తావిస్తూ, ఓటు బ్యాంక్ రాజకీయాలకోసం ప్రతిపక్షాలు అనవసరంగా ఈ అంశాన్ని పదే పదే లేవెత్తుతూ వచ్చాయని ధ్వజమెత్తారు. అంతేకాదు ఆ పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీకి, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ‘ప్రతిపక్షాలన్నీ కూడా ఏదో ఒక సమయంలో ఈ గేమ్ ఆడాయి. ప్రధానిని అపఖ్యాతిపాలు చేయడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ను ఉపయోగించుకున్నారు. ఒక అమాయక ముస్లిం యువతిని హతమార్చారని, దీనికి మోదీ, అప్పుడు గుజరాత్ హోం మంత్రిగా ఉండిన అమిత్ షాయే బాధ్యులని శరద్ పవార్ అన్నారు. ఇషత్ బిహార్ ముద్దుబిడ్డ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. లష్కరే తోయిబా టెర్రరిస్టయిన ఇషత్ తన సోదరి అని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇప్పుడు వీళ్లంతా మోదీకి, షాకు, మొత్తం జాతికి క్షమాపణ చెప్పాలి’ అని సిద్ధార్థ నాథ్ అన్నారు.