జాతీయ వార్తలు

కాలిబూడిదైన హిస్టరీ మ్యూజియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ రాజధానిలోని ఫిక్కీ ఆడిటోరియంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించి నేచురల్ హిస్టరీ మ్యూజియం పూర్తిగా దగ్ధమైంది. భవనంలోని ఆరో అంతస్థులో తెల్లవారు జామున మంటలు వ్యాపించాయి. 35 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించి మంటలను అదుపు చేశారు. మంటలను ఆర్పుతుండగా గాయపడిన ఆరుగురు అగ్నిమాపక సిబ్బందిని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక వ్యవస్థ సరిగా లేనందునే భారీ ప్రమాదం జరిగిందని సమాచారం.