ఐడియా

మెడ మెరిసేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునంద చక్కటి రూపురేఖలతో చూడముచ్చటగా ఉంటుంది. కానీ, తన మెడభాగం మాత్రం నల్లగా వుంటుందని ఆమె ఎప్పుడూ ఆందోళన చెందుతుంటుంది. ఇలాంటివారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే కేవలం నెల రోజుల్లోనే మంచి ఫలితాలు పొందవచ్చు. శెనగపిండి లేదా బార్లీ పిండిలో కాస్త పెరుగు కలిపి మెడ భాగం వద్ద బాగా పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. స్నానం చేయడానికి అరగంట ముందు నిమ్మకాయ ముక్కలతో మెడ చుట్టూ మృదువుగా రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తే కొద్ది రోజుల్లోనే మెడపై నలుపుదనం మాయమవుతుంది. రోజూ స్నానం చేసేటపుడు మెడ భాగాన్ని అన్ని వైపులా సబ్బుతో చక్కగా రుద్ది శుభ్రం చేసుకోవడం అలవరచుకోవాలి. కొందరి మెడలో అలంకరించుకునే నగలు అపరిశుభ్రంగా ఉంటూ, చెమట వాసన వెదజల్లుతూ ఇన్‌ఫెక్షన్ కలిగించేలా ఉంటాయి. నగలను వారానికోసారైనా కుంకుడు రసంతో శుభ్రం చేయడం మంచి అలవాటు. పూసల దండలు, ఆర్ట్ఫిషియల్ గొలుసులు చర్మంపై ఎలర్జీ కలిగించేలా ఉంటే వాటిని వాడకపోవడం ఉత్తమం. మెడ చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోయిన వారు వైద్య నిపుణుల సలహాలతో తగిన వ్యాయామం చేస్తూ ఆ సమస్య నుండి బయటపడవచ్చు. ఎండలో బయటికి వెళ్ళేటపుడు స్కార్ఫ్ ధరించి సూర్య కిరణాలు నేరుగా శరీరంపై సోకకుండా జాగ్రత్త వహించాలి. ఇలా కొద్దిపాటి పద్ధతులను ఆచరిస్తే మెడ భాగం పరిశుభ్రంగా ఉంటూ మంచి నిగారింపును సంతరించుకుంటుంది.

-జి.అరుణ