ఐడియా

మల్లెపూల మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాఘమాసం వచ్చిందంటే చాలు.. మల్లెపూల ఘుమఘుమలు మొదలు.. మల్లెపూలు పరిమళానే్న కాదు, చర్మానికీ మేలుచేస్తాయి. వీటిల్లో సహజంగా ఉండే ఔషధ గుణాలే ఇందుకు కారణం. ఈ కాలంలో ఎక్కువగా దొరికే మల్లెపూలతో ఎలాంటి పూతలు వేసుకోవచ్చో చూద్దాం.
* మల్లెల్లో యాంటమైక్రోబయల్, యాంటీసెప్టిక్ గుణాలు అధికం. అందువల్ల ఈ నూనెకు బాదం, కొబ్బరి నూనెలను సమపాళ్లలో కలిపి తలకు మర్దనా చేసుకోవాలి. ఓ రెండు, మూడు గంటల తర్వాత షాంపూతో కడిగేయాలి. ఇలా నెలలో రెండుసార్లు చేస్తుంటే చుండ్రు తగ్గుముఖం పడుతుంది. మాడుకు రక్తప్రసరణ జరిగి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగానూ, అందంగానూ మారుతుంది.
* గుప్పెడు మల్లెపూలను వేడినీళ్లలో వేసి రెండు గంటలపాటు నాననిచ్చి వడకట్టుకోవాలి. తలస్నానం పూర్తయ్యాక ఈ నీటితో జుట్టును కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌లా పనిచేసి పట్టులా మెరిసేలా చేస్తుంది.
* చెంచా మల్లెనూనెను నిండుగా నీళ్లున్న చిన్న స్ప్రే సీసాలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాహుమూలల్లో చల్లుకుంటే చెమట దుర్వాసన తగ్గుతుంది. ఇతర డియోడరెంట్‌ల అవసరం ఉండదు.
* జిడ్డు చర్మం ఉన్నవారు రెండు చెంచాల మల్లె నూనెలో నాలుగు చెంచాల చొప్పున ముల్తానీమట్టి, గులాబీ నీటిని కలిపి ముఖానికి పూతలా వేయాలి. పది నిముషాల తర్వాత కడిగేయాలి. కనీసం వారానికోసారి ఇలా వేసుకుంటే చర్మగ్రంథుల్లోని జిడ్డు తగ్గి ముఖం కాంతివంతంగా ఉంటుంది.
* పొడిబారిన చర్మం ఉన్నవారు మూడు చుక్కల మల్లె నూనెకు నాలుగు చెంచాల శెనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా గులాబీ నీటిని కూడా కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత కడిగేస్తే చాలు. చర్మం పొడిబారేగుణం తగ్గి మృదువుగా మారుతుంది.
* గుప్పెడు మల్లెపూల రేకల్ని ముద్దలా చేసి అందులో నాలుగు చెంచాల పెరుగు, చెంచా పంచదార కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిముషాల కడిగేస్తే మృతకణాలు పోయి ముఖం తాజాగా మారుతుంది.
* మల్లెనూనెను ఇంట్లో తయారుచేసుకోవాలంటే గుప్పెడు మల్లెలను నలగొట్టినట్లు చేసి ఆలివ్ నూనెలో వేయాలి. రెండురోజుల తరువాత వడకడితే మల్లెనూనె తయారవుతుంది.