ఐడియా

పరీక్షల్లో పిల్లలకు తోడుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడే తాపత్రయం తెలిసిందే.. కానీ ఈ తాపత్రయం, ఆత్రుత పిల్లల్లో ఉన్న సహజ ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. పదో తరగతి విద్యార్థికి ‘ఎ’ గ్రేడ్, ఇంటర్ విద్యార్థికి 99 శాతం తప్పనిసరి అనే ఆంక్షలు వారిలో మానసిక భయాన్ని పెంచుతున్నాయి. అంచనాలు తప్పితే విద్యార్థుల కంటే వారి తల్లిదండ్రులే ఎక్కువగా తల్లడిల్లిపోతున్నారు. పిల్లలను ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. అసలు పరీక్షలంటేనే పిల్లల్లో తెలియని భయం, ఒత్తిడి ఉంటాయి. తల్లిదండ్రుల బెదిరింపులతో అవి మరింత పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు అండగా ఉంటే పిల్లలు మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుంటుంది.
* తల్లిదండ్రులు పిల్లల మానసిక స్థితిని తెలుసుకోవాలి. పరీక్షలంటే భయపడినా, వాటి కారణంగా ఒత్తిడికి లోనైనా.. వారిని దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పాలి. వారితో సానుకూలంగా వ్యవహరించాలి.
* తోటి పిల్లలతో పోల్చడం మానేయాలి. పరీక్షల సమయంలో వారిని చదువుకోమని చెప్పి తల్లిదండ్రులు సినిమాలు, ఫంక్షన్లు అని తిరగకూడదు.
* రాత్రివేళల్లో వారు చదువుకున్నంతసేపు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు మెలకువగా ఉండటం అవసరం.
* చదువుకోడానికి మంచి వాతావరణం అవసరం. ఇందుకోసం ఇంట్లో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూడాలి.
* ఈ సమయంలో పిల్లలకు తేలిగ్గా జీర్ణమయ్యే బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలి.
* సమయాన్ని వృథా చేస్తున్నావు, చదువుకో అంటూ పిల్లలపై కేకలు వేయకూడదు.
* అవకాశం మేరకు పిల్లలు పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడంతో వారిలో కొద్దిగానైనా టెన్షన్‌ను తగ్గించవచ్చు. అది మొదటిరోజు చేస్తే మరీ మంచిది.