ఐడియా

హార్మోన్ సమస్యా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది మహిళల్ని హార్మోన్ల అసమతుల్యత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. వీటిని ఎవరికి వారు తీసుకోవాలి. అవేంటంటే..
* క్రిమి సంహారకాలు, ప్లాస్టిక్‌లు, ఇంటిని శుభ్రం చేసే క్లీనర్లలో రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి హార్మోన్లపై ప్రభావం చూపిస్తాయి. అందుకే వీటిని అత్యవసరం అయితే తప్ప వాడకపోవడం మంచిది. ముఖ్యంగా వేడి వేడి పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లో భద్రపరచడం మానేయాలి.
* కెఫీన్ శాతం అధికంగా ఉండే పదార్థాలను వీలైనంతవరకూ తగ్గించాలి. వీటికి బదులు గ్రీన్, హెర్బల్ టీలను తాగాలి. వీటివల్ల హార్మోన్లు సమతూకంలో ఉంచడమే కాదు, వార్థక్యపు ఛాయలు కూడా దరిచేరకుండా ఉంటాయి.
* బరువు తగ్గాలన్న ఉద్దేశ్యంతో కొవ్వు ఉండే ఆహార పదార్థాలను మానేస్తుంటారు కొందరు. కానీ హార్మోన్లు సమతూకంలో ఉండాలంటే.. శరీరానికి మేలుచేసే కొవ్వు పదార్థాలు అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అందడం కోసం కొబ్బరినూనె, నాణ్యమైన వెన్న, ఆవిల్‌నూనె, నట్స్, మాంసాహారులైతే చేపల్ని తినడానికి ఎంచుకోవాలి.
* నిద్రపోతున్నప్పుడు మనలో ఉండే విషపదార్థాలను శరీరం చురుగ్గా విసర్జిస్తుంది. మెదడుని కూడా రీఛార్జ్ చేస్తుంది. హార్మోన్ల పనితీరును కూడా మెరుగ్గా ఉంచుతుంది. కానీ ఒక్కరోజు సరిగ్గా నిద్రపోకపోయినా కూడా హార్మోన్లపై విపరీతమైన ప్రభావం పడుతుంది. ఫలితంగా మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎన్ని పనులున్నా కంటినిండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
* ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. ముఖ్యంగా హార్మోన్ల అసమతూకం ఉన్నవారు వ్యాయామాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. *