ఐడియా

తల్లిపాలు పట్టించే టెక్నాలజీతో ఇబ్బందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లిపాల గొప్పతనం గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. మొదటిసారిగా తల్లైన తల్లులకు, పాలిచ్చే తల్లులకు చాలా రకాలుగా సహకరించే ఆప్‌లు అందుబాటులోకి వచ్చాయి. బిడ్డ ఎంత గ్యాప్‌తో పాలు తాగుతోంది.., చివరిసారిగా ఏ వైపు తాగింది.., సగటున బిడ్డ ఎంతసేపు పాలు తాగుతోంది.., ఎంత సేపటికి ఒకసారి పాలు తాగుతుంది.. ఇలాంటి సమాచారాన్ని ఈ ఆప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అన్ని వైద్య సంస్థలూ తల్లిపాలు పట్టించడం వల్ల అటు పిల్లలకు, ఇటు తల్లులకు కలిగే లాభాలను ప్రచారం చేస్తున్నాయి. కానీ పసికందులకు పాలు పట్టించడంలో చాలామంది తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు సరిగ్గా పాలు పట్టించలేకపోతున్నామని కొందరు బాధపడుతున్నారు.
పిల్లలకు పాలు పట్టించడంలో తల్లులకు సహకరించే టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఫలితంగా ఈ వ్యాపారం ఎక్కువగా ఊపందుకుంది. కాలిఫోర్నియాకు చెందిన రియల్ ఎస్టేట్ ఉద్యోగం చేసే యాష్లే ఆల్బర్ట్‌కు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ నాలుగేళ్లలోపు వారే.. పిల్లలకు పాలివ్వటంలో 3బేబీ కనెక్ట్2 అనే ఆప్ తనకు బాగా ఉపయోపడిందని ఆమె చెబుతున్నారు. ఈ ఆప్‌లో సమాచారం మొత్తాన్ని రికార్డు చేయటంతో పాటు అలారమ్‌లను కూడా పెట్టుకోవచ్చు. ఫలితంగా పాలివ్వటం, డైపర్లు మార్చటం, పిల్లల ఎదుగుదల, వారికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, ఆస్పత్రి సమాచారం, మందులు, ఆహారం.. ఇలా పిల్లలకు సంబంధించిన ప్రతి విషయానికీ ఈ ఆప్‌ను వాడుకోవచ్చు అని ఆల్బర్ట్ చెబుతోంది. సమయాన్ని అక్కడ నిర్ణయిస్తే ఆ సమయాన్ని అనుసరించి అలారం మోగి తల్లులకు ఆ విషయాన్ని గుర్తుచేస్తుంది ఈ ఆప్. అమెరికాలో స్థిరపడిన ఫ్రెంచ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గ్జేవియర్ లానే 2008లో తన భార్య ఇద్దరు పిల్లలకు పాలు పట్టించడంలో సహకరించడానికే ఈ ఆప్‌ను రూపొందించాడు. ఫీడ్ బేబీ, మైమెడెల వంటి ఆప్‌లు కూడా ఇప్పుడు వినియోగంలో ఉన్నాయి. కానీ ఈ ఆప్‌లు బిడ్డల ఫీడింగ్‌కు ఉపయోగపడతాయని అందరూ ఒప్పుకోవట్లేదు.
తల్లికి తెలిసిన ఈ విషయాలన్నీ ఆప్ ద్వారా తెలుసుకోవడమేమిటి? అని చాలామంది అనుకోవచ్చు.. కానీ ఒక తల్లి పని కేవలం పిల్లల్ని చూసుకోవడమే కాదు.. తన జీవితాన్ని కూడా మెరుగులు దిద్దుకోవాలి. కెరీర్ పరంగా తనకున్న లక్ష్యాలను సాధించడం, స్వతంత్రంగా ఎదగడం కూడా.. కాబట్టి ఈ ఆప్‌ల సహకారం చేసుకుంటే నేటి మహిళ రెండింటినీ సంతోషంగా సమన్వయం చేసుకోగలుగుతుంది. కానీ ఈ ఆప్‌లు అర్థవంతమైనవి కావని, పిల్లల గురించి తల్లికి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు అని కొందరు అంటున్నారు. మనం ఇచ్చే సమాచారాన్ని విశే్లషించి, మనకు కొత్త సమాచారాన్ని, విలువైన సలహాలను ఇచ్చేలా ఉండాలి ఆప్‌లు.. పంప్‌ల సహాయంతో పాలు తీసి, డబ్బాల్లో పోసి పిల్లలకు పట్టించడం మనకు కొత్తకాదు. అయితే మరో ఐదు సంవత్సరాల్లో ఈ పంప్‌లు పదకొండు శాతం పెరగనున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే పాలు తీసేటప్పుడు ఈ పంప్‌లు వింత శబ్దాలు చేస్తున్నాయని కొందరు తల్లులు ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి రాబోయేకాలంలో పెరుగుతున్న సాంకేతికతతో శబ్దాలను తగ్గించే అవకాశం కూడా ఉంది.