ఐడియా

శిరోజాల సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, గుడ్లు, ప్రొటీన్స్, హెర్బల్ షాంపులవలన శిరోజాలు పుష్టిగా అందంగా పెరుగుతాయని భ్రమపడతారు. కానీ ఇది కేశాలకు పోషక విలువలను మాత్రమే కలుగజేస్తాయి.
నార్మల్ హెయిర్ గలవారు కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి, తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చక్కని ఫలితం పొందవచ్చు.
సాధ్యమయినంతవరకు శిరోజాలకు సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్తపడాలి. సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలవలన వెంట్రుకలు బిరుసుగా తయారవుతాయి. దానివలన శిరోజాలు త్వరగా నెరవడం జరుగుతుంది.
ఆయిలీ హెయిర్ గలవారు ఆహారంలో నూనె, కొవ్వు అధికంగా ఉన్న పదార్థాలు తగ్గించాలి.
డ్రై హెయిర్, నార్మల్ హెయిర్ కలవారికంటే ఆయిలీ హెయిర్ కలిగినవారు తరచుగా శిరఃస్నానం చేస్తుండాలి.
శిరోజాల చివరలు కత్తిరిస్తే, త్వరగా పెరుగుతాయనే అపోహ కొందరికి ఉంటుంది. కానీ ఇది అపోహ మాత్రమే. కేశాల చివరలు కత్తిరిస్తే కేశం పూర్తిగా చిట్లిపోకుండా నివారించవచ్చు.
సాధ్యమైనంత వరకు మృదువయిన హెయిర్ బ్రష్‌లను, పళ్ళు దూరంగా ఉండే దువ్వెను ఉపయోగిస్తుంటే విరోజాలు త్వరగా రాలిపోవు.
నిమ్మచెక్కలను బాగా ఎండబెట్టి, పొడి చేసి, దాన్ని సీకాయ పొడిలో కలుపుకొని అభ్యంగన స్నానం చేస్తుంటే శిరోజాలు చక్కని మెరుపును సంతరించుకుంటాయి.
జీడిగింజలను పగులగొట్టి నువ్వుల నూనెలో వేసి మరిగించి తలకు రాసుకుంటే శిరోజాలు క్రమంగా నల్లబడతాయి
పేనుకొరుకుడు ఉన్న ప్రదేశంలో మందార పువ్వులతో చక్కగా మర్దనా చేసినట్లయితే, చక్కని ఫలితం పొందవచ్చు.
నువ్వుల నూనె, ఉసిరికాయల రసం సమభాగాలుగా కలిపి, మరగకాచి, చల్లారిన పిమ్మట ప్రతిరోజు తలకు రాసుకుంటే శిరోజాలు నెరవవు.
జుట్టు పలుచగా ఉంటే ప్రతిరోజు పచ్చిపాలను కుదుళ్ళకు బాగా రాసి, గంట తర్వాత, తల స్నానం చేస్తే రెండు మాసాలలో జుట్టు పెరగడం గమనించవచ్చు.
జడ బిగించి వేసుకున్నట్లయితే శిరోజాలు రాలిపోతాయి.
ఆరోగ్యవంతమైన శిరోజాల కోసం ఆహారంలో విటమిన్ ఎ, బి అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి.