ఐడియా

తులసీ టీ తో లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయులు తులసి మొక్కను సౌభాగ్యానికి ప్రతీకగా, ఎంత పవిత్రంగా కొలుచుకుంటారో అందరికీ తెలిసిందే.. అలాగే తులసి మొక్కలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో కూడా తెలిసిన విషయమే.. అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నందు వలన తులసిని పురాతన కాలం నుండే ఆయుర్వేద ఔషధాల తయారీలో విరివిగా వాడుతున్నారు. మరి అలాంటి తులసి టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఒకసారి చూద్దామా..!

* ప్రతిరోజూ తులసి టీ తాగడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలో ఉండే నిర్జీవ కణాలను తొలగించి, నూతన కణాల పునరుత్పత్తికి తోడ్పడతాయి. కాబట్టి యవ్వన చర్మాన్ని పొందడానికి ప్రతిరోజూ తులసి టీ తాగడం తప్పదు.

* మధుమేహ వ్యాధిగ్రస్తులు తులసి టీ తాగడం మంచిది. ఎందుకంటే ఈ టీలో ఉండే అన్ శాచురేటెడ్ ఫాటీ ఆసిడ్‌లు రక్తంలో ఉండే అధిక చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నవారు రోజుకు ఒకసారి టీ తాగడం మంచిది.

* అజీర్ణం, మలబద్ధకం వంటి ఇతరత్రా జీర్ణసమస్యలకు తులసి టీ చక్కటి ఔషధంగా పేర్కొనవచ్చు. యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉండే తులసి టీ దాదాపు అన్ని రకాల జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది.

* తులసి టీ శరీరాన్ని డీ టాక్సిఫైకి గురిచేస్తుంది. కాబట్టి మూత్రపిండాల్లో రాళ్లు కలిగినవారు ఈ టీని తప్పక తాగాలి. రోజూ ఈ టీని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు త్వరగా కరిగిపోతాయి.