ఐడియా

కొవ్వును తగ్గించే పైన్ గింజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండె పదికాలాలపాటు ఆరోగ్యంగా కొట్టుకోవాలనుకుంటున్నారా? అయితే క్రమం తప్పకుండా రోజూ గుప్పెడు గింజలను తినండి అని చెబుతున్నారు వైద్యులు, పోషక నిపుణులు. గింజల్లో ఉండే అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా గుండెకు మేలు జరుగుతుంది. అందుకే మునుపు స్వీట్లలోనూ, పాయసాల్లోనూ కనిపించే డ్రైఫ్రూట్స్.. ఈ మధ్య అన్ని ఇళ్లల్లోనూ స్నాక్‌ఫుడ్‌గా మారుతున్నాయి. అయతే అందం కోసం పెంచుతారనుకునే పైన్ చెట్ల గింజల్లో అద్భుత పోషక నిల్వలు ఉంటాయని తెలుసా మీకు. పైన్ గింజల్లో ఓలియాక్ ఆమ్లం వంటి మోనోఅన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వీటిల్లోని పినోలెనిక్ ఆమ్లం ఆకలిని తగ్గించే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుందన్నది కొత్త పరిశీలన. అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లకివి ఎంతో మేలు. కంటిచూపుని మెరుగుపరిచే విటమిన్ ఎ, ల్యూటెన్‌లు వీటిల్లో ఎక్కువగా ఉంటాయి. విటమిన్ డి, ఐరన్‌లు కూడా వీటిలో ఎక్కువే.

వందగ్రాముల పైన్ గింజల్లో..

శక్తి: 673 కేలరీలు
కొవ్వులు: 68.4 గ్రాములు
శాచ్యురేటెడ్: 4.9 గ్రాములు
పాలీఅన్‌శాచ్యురేటెడ్: 34.1 గ్రాములు
మోనోఅన్‌శాచ్యురేటెడ్: 19 గ్రాములు
ప్రొటీన్లు: 14 గ్రాములు
పిండి పదార్థాలు: 13 గ్రాములు
విటమిన్ ఇ: 9.33 మిల్లీగ్రాములు
పొటాషియం: 597 మిల్లీగ్రాములు
కాల్షియం: 16 మిల్లీగ్రాములు
ఐరన్: 5.53 మిల్లీగ్రాములు
మెగ్నీషియం: 251 మిల్లీగ్రాములు
సెలీనియం: 0.7 మైక్రోగ్రాములు