ఐడియా

శ్వాసకోశ వ్యాధులకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన భారతీయం ప్రతిరోజు సూర్యనమస్కారాలు చేయమంటుంది. సూర్యనమస్కారాలు చేస్తే యోగాసనాలు త్వరగా అబ్బుతాయ. ప్రతిరోజు కాస్తంత నడక, కాస్తంత వ్యాయామం తో మానసికంగాను, శారీరికంగాను ఆరోగ్యంగా ఉండవచ్చు. వర్షాకాలం, చలికాలం శ్వాసకోశ వ్యాధులు చలి, వర్షాకాలాల్లో మరింత ప్రభావాన్ని చూపుతాయి. వీటి నుంచి తప్పించుకుని ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలే చక్కని ఉపశమన మార్గాలంటున్నారు యోగానిపుణులు. యోగాసనాల్లో భుజంగాసనంతో శ్వాససంబధ బాధలను దూరం చేసుకోవచ్చు. భుజంగాసనం వల్ల థైరాయిడ్ గ్రంథి పని తీరు మెరుగుపడుతుంది. సర్వైకల్ స్పాండిలైటిస్ అనే మెడకు సంబంధించిన వ్యాధి రాకుండా పూర్తిగా నివారిస్తుంది. ఊపిరి తిత్తుల వ్యాకోచ సంకోచనాలకు అనువైన మార్పులు వస్తాయి. శరీరం చాలా శక్తివంతంగా తయారు అవుతుంది. వెన్నుకు మంచి శక్తి వస్తుంది. దీనివల్ల డిస్కెల సమస్యలు దూరమవుతాయి. నాభి వరకు సాధన చేయడం వల్ల పొట్ట కండరాలు గట్టిపడి జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
క్రమం తప్పకుండా ప్రతిరోజు అరగంట నడిస్తే ఋతు మార్పులతో వచ్చే అనారోగ్యాలకు చెక్ చెప్పవచ్చు. అట్లా వీలులేని వారు కనీసం వారానికి 5 రోజులైనా తప్పనిసరిగా నడకను అలవాటు చేసుకోవాలి.
నడకతోపాటుగా చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉంటే శరీరంగా ఫిట్‌గా ఉంటుంది.