ఐడియా

రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిలు, పురుషులు అందరూ క్షణం తీరికలేకుండా ఈ యాంత్రిక ప్రపంచం లో పరుగులు తీస్తూన్నారు. తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కలుషితాలు అయిపోతున్నాయి. వాటితో పాటు మనిషి సరియైన వ్యాయామం లేక ఎన్నో జబ్బుల బారిన పడుతున్నారు. చాలామంది ఊబకాయలుగా మారుతున్నారు. మరికొద్దిమంది వయస్సు తగ్గ ఎదుగుదల లేకుండా ఉంటున్నారు. వీటిఅన్నింటికీ కారణం ఏమిటి అంటే నిపుణులు... మనిషి శారీరిక శ్రమకు దూరమవుతున్నాడు. ఏ వస్తువునైనా కొన్నాళ్లు వాడకుండా మూలన పడేస్తే అది పనిచేయడానికి మొరాయించినట్లే మనిషి శరీరం కూడా ఏ శ్రమ, వ్యాయామం లేక అనేక వ్యాధుల బారిన పడుతోంది. చిన్న రుగ్మత వస్తేనే దానికి తట్టుకోలేక గిజ గిజలాడుతున్నారు వీటినుంచి తప్పించుకుని మనిషి శారీరికంగాను, మానసికంగాను ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు, నడక తప్పని సరి. నలుగురితో కలసి మాట్లాడడం, బంధువులు,స్నేహితులతో సత్సంబంధాలను కొనసాగించడం అత్యవసరం అంటున్నారు.
కానీ వ్యాయామాలు చేయాలంటే మాకు టైము సరిపోవడం లేదు అని చాలామంది చెబుతున్నారు. అదిగో అలాంటి వాళ్లకు చిన్న సలహాలు.
ఆఫీసులో అదే పనిగా కూర్చున్న చోట నుంచి లేవకుండా పని చేయకుండా కనీసం గంటకు ఒకసారి అన్నా లేచి అటుఇటు ఐదునిముషాల పాటు నడవండి. కూర్చున్న చోటులోనే చేతులు చాచడం, నడుము ప్రక్కకు తిప్పడం కాళ్లు చాపడం లాంటి వ్యాయామాలు ఐదు, పదినిముషాలు మీ వీలును బట్టి చేస్తుండండి.
అప్పుడు మీ శరీరం కర్రపుల్లల్లాగా నిటారుగా కాక కాస్తకాస్త మీ అదుపులోకి వస్తుంటుంది. స్ర్తిలు ఎక్కువగా నడుం నొప్పి అంటుంటారు కదా. అట్లాంటి వారు కనీసం అరగంట కొకసారి మీ నడుమును ఐదునిముషాల పాటు కుడివేపుకు, ఎడమవేపుకు తిప్పండి. అట్లా తిప్పడం వల్ల నడుముకు కావాల్సిన వ్యాయామం లభిస్తుంది. అట్లానే చేతులు పైకి, కిందికి, పక్కలకు చాపుతూ ఉండడం వల్ల కూడా కండరాలకు మంచి బలం చేకూరుతుంది.
ప్రతిరోజు వేళకు తిండి, నిద్ర తో పాటుగా ఈ చిన్న చిన్న వ్యాయామాలు, యోగసాధనలు చేస్తే శరీరం తేలిక అవుతుంది. ఉపశమనంగా ఉంటుంది.మనసు ప్రశాంతత పొందుతుంది. పూర్వపు ఉత్తే జం రెట్టింపు అవుతుంది. దానితో అనుకొన్న దానికన్నా మెరుగైన ఫలితాలను మీ పనిలో మీరు చూపించవచ్చు.
ప్రతిరోజు కాస్త సమయం నడిస్తే మంచి ఆరోగ్యము, ఆలోచనలు మీ సొంతం అవుతాయి. పొద్దున అరగంట నడక లేక మీకిష్టమొచ్చిన వ్యాయామాలు చేస్తే రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేయవచ్చు.

- వాణిప్రభాకరి