ఐడియా

విద్యుత్తు ఆదా ఇలా....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజువారీ అలవాట్లలో స్వల్ప మార్పులు చేసుకోవడం వల్ల ఇంట్లో విద్యుత్తుని, నీటిని ఆదా చేసుకోవచ్చు. ఫలితంగా ఇంటి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవచ్చు. విద్యుత్తు, నీటిని అధికంగా వినియోగించే వాటిలో బాత్‌రూములతో పాటు, వాటర్ హీటర్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చాలా ఉన్నాయి. వీటితో పాటు వాషింగ్ మెషీన్స్, డ్రైయర్లు, డిష్ వాషర్లు వంటి ఇతర పరికరాలతో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందనుకుంటారు. కానీ వీటికి మరింత ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల అవి నీటి, విద్యుత్ బిల్లులను కూడా తగ్గించగలవు. దీనికి కారణం వాటర్సెన్స్, ఎనర్జీ స్టార్ లేబుల్స్ గల వస్తువుల వాడటం వల్ల వినియోగదారులకు మరింతగా నీటి, విద్యుత్తు ఖర్చు చేయకుండా ఆదా చేస్తాయి.
* ఎయిర్ కండీషన్ థర్మోస్టాటును 24 డిగ్రీల సెల్సియస్ సెట్ చేయాలి. ఇలా చేస్తే విద్యుత్తు బిల్లు తక్కువ పడుతుంది. అంతకు మించి ఒక్క డిగ్రీ సెల్సియస్‌ను తక్కువ చేసినా బిల్లుకు తొమ్మిది శాతం అదనపు భారం జత చేస్తుంది.
* వాషింగ్ మెషీన్స్, డ్రైయర్స్, ఐరన్ బాక్స్, ఓవెన్స్ వంటి కొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగమును మధ్యాహ్నం పనె్నండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అలాగే రాత్రి ఎనిమిది గంటల నుంచి రాత్రి పనె్నండు గంటల లోపు వరకు వాడకుంటే మంచిది.
* వాటర్ హీటర్స్‌లో ఏమైనా లీకేజు ఉన్నాయేమో గుర్తించడానికి నిర్దేశించిన ప్రామాణిక సమయంలో సరైన నిర్వహణలు చేపట్టడం మంచిది. ఈ పరికరం థర్మోస్టాట్ టెంపరేచర్ అరవై డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. వేసవిలో అవసరం లేనప్పుడు దాన్ని ఆపేయడం మంచిది.
* విద్యుత్తు వినియోగంపై పనిచేసే ఎలక్ట్రిక్ కుక్కర్ల, ఇండక్షన్ స్టవ్‌ల స్థానంలో గ్యాస్‌పై పనిచేసే కుక్కర్లను వాడటం మంచిది.
* రిమోట్ కంట్రోల్‌తో టీవీని ఆపేసినప్పటికీ టీవీ ప్లగ్గిన్ అయినా విద్యుత్ మూలానికే ఇప్పటికీ కనెక్ట్ అయ్యుంటుంది. కాబట్టి టీవీ పరికరాలకు ప్రధాన విద్యుత్ వనరును అందించే స్విచ్ బోర్డును ఆపేయడం ఉత్తమం.
* ఫ్లోరోసెంట్ బల్బులను వాడాలి. ఇవి ప్రకాశవంతంగా ఉంటూ మరింత సమర్థవంతంగా పనిచేస్తూ విద్యుత్తును ఆదా చేస్తాయి.
* నీటిని పరిరక్షించే అడాప్టర్లను కుళాయిలకు అమరిస్తే టాప్ ద్వారా ప్రసరించే నీటిప్రవాహం దాదాపు సగం వరకు తగ్గుతుంది.
* వంట పాత్రలను కడగటానికి పూర్తిగా తెరచి ఉన్న కుళాయిని ఉపయోగించడానికి బదులుగా, సగం వరకు నీటితో నింపిన తొట్టెను ఉపయోగించడం వల్ల ప్రతి పదిహేను నిముషాలకు ముప్పై లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు.
* షేవింగ్ చేసుకునేటప్పుడు, పండ్లు, కూరగాయలను కడిగేటప్పుడు మగ్గుల్లో, గినె్నల్లో నీటిని నిల్వ ఉంచుకుని కడగడం వల్ల చాలా నీటిని ఆదా చేసుకోవచ్చు. ఇలా నీటిని ఆదా చేసుకోవడం వల్ల నీటికోసం మాటిమాటికీ మోటరు వేసే అవసరం రాదు. విద్యుత్తునూ ఆదా చేసుకోవచ్చు. ఫలితంగా ఇంటి బడ్జెట్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది.
*