ఐడియా

గింజల్లో గుణాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండ్లను తిని గింజలు విసిరేయడం ఎవరైనా చేసే పనే. అయితే గింజలను దాచుకుని, తిన్న వాడే అసలుసిసలు ఆరోగ్యవంతుడు అంటున్నారు నేటి న్యూట్రిషనిస్టులు. శరీరానికి అవసరమైన పోషణ వీటిలో సమృద్ధిగా ఉంటుంది. అయితే ఏ ఏ గింజలు తింటే ఏ పోషకాలు లభిస్తాయో చూద్దాం..

పుచ్చకాయ

పుచ్చకాయ గింజలు అంత రుచిగా ఉండకపోయినా గుండె ఆరోగ్యాన్ని మాత్రం అందిస్తాయి. రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేస్తాయి. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తాయి. పుచ్చ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి తర్వాత ఆరబెట్టుకోవాలి. తరువాత వీటిపైనున్న పొట్టును తీసేయాలి. ఇప్పుడు వీటిని స్నాక్స్‌గా తీసుకోవాలి.

బొప్పాయి

ఈ గింజలు కొద్దిగా చేదుగా ఉంటాయి. కానీ వీటిలో శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి మెండుగా ఉంటాయి. బొప్పాయి గింజలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిని కొద్ది తేనెలో వేసుకుని తీసుకుంటే మరీ మంచిది.

గుమ్మడి

ఈ గింజల్లో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి బ్లాడర్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి కొన్ని రకాల కేన్సర్‌లను కూడా నివారిస్తాయి. వీటిని డైరెక్టుగా లేదా సలాడ్స్‌లా తీసుకున్నా మంచిదే.

అవిసె

పోషకాలతో నిండి ఉన్న ఈ గింజలు ఆరోగ్యకరమైన డైట్. వీటిని సలాడ్, పప్పు, తాజా పండ్లరసాలతో కలిపి తీసుకోవచ్చు. రక్తపోటు, రక్తంలో చక్కెర నిల్వలు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడతాయి. వేయించిన అవిసె గింజలు ఆకలిని నియంత్రిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి డైట్.

పనస

ఈ గింజలతో చర్మవ్యాధులకు చెక్ పెట్టవచ్చు. చర్మం ముడతలు పడటం, ఇతర చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు పనస గింజలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇవి రక్తహీనతను కూడా నివారిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టుకోసం, మెరుగైన కంటి చూపు కోసం వీటిని తరచూ తీసుకోవాలి. పనస గింజల్ని మెత్తగా అయ్యేంతవరకు ఉడికించి పై తోలు తీసేసి తినాలి.

పొద్దుతిరుగుడు

ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఛాతి నొప్పిని తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరుకు, గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, ఆస్తమా వంటి వ్యాధులను నివారిస్తాయి. జుట్టు, చర్మం ఆరోగ్యానికి తోడ్పడతాయి. వీటిని స్నాక్స్‌గానూ, సలాడ్‌గానూ తీసుకోవచ్చు.