ఐడియా

మొలకెత్తిన శనగలు ఆరోగ్య సిరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రావణంలో మంగళ , శుక్ర, శని, సోమ ఇలా అన్ని వారాలు ముఖ్యమైనవే. ముతె్తైదువులకు తాంబూలాలు అంటూ ఇస్తుంటారు. వీటిల్లో నానబెట్టిన శనగలు తప్పనిసరిగా ఇస్తారు. వీటిని పచ్చివే కాక వంటకాల్లోను ఉపయోగించి రుచికరమైన వంటలు తయారు చేస్తుంటారు. నానబెట్టిన శనగలు ప్రతిరోజు తీసుకొంటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మొలకెత్తిన గింజలు ఒక్క శనగలే కాదు ఏ తృణధాన్యమైనా ఆరోగ్యానికి మంచిదే. వందగ్రాముల శనగల్లో 115 క్యాలరీల శక్తి 7.2 గ్రాముల ప్రోటీన్లు, 16.1 గ్రాముల కార్బోహైడ్రేట్సు, 2.9 గ్రాముల కొవ్వు, 17.1 శాతం మాంస కృత్తులు, 190 మిల్లీగ్రాముల కాల్షియం, 168 గ్రాముల మెగ్నీషియం, 9.8 గ్రాముల ఇనుము, 71 మిల్లీగ్రాముల సోడియం, 322 మి.గ్రా. పోటాషియం, 361 గ్రాముల కెలరీలు ఉంటాయి. ఇవి కాక పైబర్ అధికంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన తక్షణ శక్తినివ్వడంలో శనగలు ప్రముఖ పాత్రను వహిస్తాయి. వీటిని సలాడ్స్‌లోను కలుపుకుని తినవచ్చు. స్లిమ్‌గా ఉండాలనుకొన్నవారు కూడా ఈ శనగలు పొద్దునే్న తీసుకోవచ్చు. మొలకెత్తిన వాటిల్లో శరీరానికి కావాల్సిన ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి. పైగా తేలికగా జీర్ణమవుతాయి. కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఉండవు. పైగా చౌకగా మనం వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
తయారీ
ముందుగా మనకు కావాల్సిన గింజలను 8 నుంచి12 గంటలపాటు నానబెట్టుకోవాలి. నానిన శనగలను నీళ్లు వంపేసి వాటిని ఒక పలుచటి వస్త్రంలో పోసి మూటకట్టి పెట్టాలి. లేదంటే టిష్యూ పేపరులోను మూట కట్టవచ్చు. ఒకరోజు ఈ మూట ను అట్టే పెట్టడం వల్ల లేక మూట పైన బరువు ఉంచడం వల్ల కూడా మరుసటి రోజుకు శనగలన్నీ చక్కగా మొలకెత్తి ఉంటాయి. మొలకెత్తిన గింజలను ఫ్రిజ్‌లో మూడురోజుల పాటు దాచుకోవచ్చు కూడా. మొలకలెత్తిన గింజలను మరసటి రోజుకు దాచుకోవడంలో వాటికి ఫంగస్, బ్యాక్టీరియా లాంటివి సోకవచ్చు. కనుక ఈ ఫంగస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

--జంగం శ్రీనివాసులు