ఐడియా
బీట్‌రూట్ తో ముఖ సౌందర్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 July 2018
బీట్‌రూట్ గడ్డను ఉడికించి గుజ్జు చేయండి. ఆ గుజ్జును ముఖంపైన, మెడ భాగంలోను అప్లై చేసి అరగంట తర్వాత చల్లని నీటితో కడగండి. ముఖంలో మెరుపులు ఖాయం. ఓట్‌మీల్ 2 స్పూన్స్ తీసుకోండి. అందులో రెండు చుక్కలు బీట్ రూట్ రసం కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆగి కడిగేయండి. అలసట మాయం అయ్యి మంచి ఫ్రెష్‌నెస్ వస్తుంది. బీట్‌రూట్స్రాన్ని రోజు అరగ్లాసు కడుపులోకి తీసుకొంటే రక్తవృద్ధి అయ్యి రక్తనాళాల పనితీరు మారుతుంది. ముఖంలోనే కాక శరీరమంతా కాంతివంతంగా తయారు అవుతుంది. బీట్‌రూట్ గుజ్జులో పెరుగు కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగినా, రోజు మార్చి రోజు ఇది చేసినా నలుపురంగులో ఉన్న ముఖంలో కాంతి తో పాటు ఛాయలో మార్పువస్తుంది.