ఐడియా
ఇలా చేద్దాం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కాలంతో సంబంధం లేకుండా కొందరికి నిత్యం పెదాలు రంగు మారడం, పొడి బారడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఆస్పత్రులకు వెళ్లి భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి పెదాలను అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
* ఆలివ్ నూనెలో కాస్త పంచదార వేసి పెదాలకు మృదువుగా రాసుకుంటే పొడి బారడం క్రమంగా తగ్గుతుంది.
* బాదం నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి పెదాలకు రోజూ రెండు సార్లు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
* దానిమ్మ గింజలను మెత్తగా ముద్దలా నూరి, అందులో తాజా పాల మీగడ కలిపి పెదాలకు రాసుకుంటే మంచి నిగారింపు వస్తుంది.
* కీర దోస రసంలో దూదిని లేదా మెత్తటి గుడ్డను ముంచి పెదాలపై మృదువుగా రాసుకున్నా మంచిదే.
* చల్లారిన పాలలో గంటసేపు నానబెట్టిన గులాబీ రేకులను ముద్దలా చేసుకుని రాసుకుంటే పెదాలకు మంచి రంగు వస్తుంది.
* రాత్రి వేళ నిద్రపోయే ముందు లిప్‌స్టిక్ ఇతర మేకప్‌ను తొలగించినపుడు బాదం నూనె లేదా ఆలివ్ నూనెను పెదాలకు రాసుకోవాలి.
* బీట్‌రూట్, క్యారట్, బంగాళా దుంపల రసంతో రుద్దుకున్నా మలినాలు పోయి పెదాలు తళతళా మెరుస్తాయి.