ఐడియా
జీర్ణానికి దివ్యౌషధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మధురమైన రుచిని అందించే మామిడి పండంటే ఇష్టపడని వారుండరు. అరుచి సమస్యను పొగొట్టే ఈ ఫలం జీర్ణానికి దివ్యౌషధంలా పనిచేస్తూ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇందులోని విటమిన్-ఎ పసివారికి, ఎదిగే పిల్లలకు, గర్భిణులకు మేలు చేస్తుంది. వీటిని తరచూ తింటే రేచీకటికి దూరంగా వుంటారు. చిన్నారులకు ప్రీతికరమైన మ్యాంగో జ్యూస్ ఊపిరితిత్తుల రోగాలను, ఎలర్జీలను నిరోధిస్తుంది. రోగనిరోధక శక్తి మెండుగా ఉన్నందున రక్తహీనత నుండి కాపాడుతుంది. పోషకాహర లోపంతో బాధపడేవారికి మేలు చేస్తుంది. అలసట నుంచి బయటపడేందుకు ఇది మంచి ఔషధం.
అయతే, మితిమీరి మామిడి పండ్లను తింటే శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం వుంది. మధుమేహ బాధితులు, స్థూలకాయులు వీటిని తీసుకునే విషయంలో వైద్యుల సలహా పాటించడం మంచిది. ఇక, ఏడాది పొడవునా మామిడికాయ రుచులను ఆస్వా దించేందుకు ఆవకాయ, మాగాయ, తొక్కుడుపచ్చడి.. ఇలా రకరకాల పచ్చళ్లు పెడుతుంటారు. మామిడి పండ్లను మాత్రం అవి లభించే సీజన్‌లోనే విరివిగా తినడం ఆరోగ్యానికి మంచిది.