జాతీయ వార్తలు

పార్లమెంటులో పండగ వాతావరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిపక్ష నేతలను పలకరించిన మోదీ * రాజ్యసభలోను అదే సుహృద్భావం

న్యూఢిల్లీ, నవంబర్ 26: శీతాకాల సమావేశాలు ప్రారంభమైన గురువారంనాడు పార్లమెంటులో పండగ వాతావరణం కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాల స్థానాల వద్దకు వెళ్లి ప్రతిపక్ష నాయకులైన మల్లికార్జున ఖర్గే, ములాయం సింగ్ యాదవ్ తదితర నేతలను కలుసుకోవడం గమనార్హం. తన మంత్రివర్గ సహచరులు, ఎన్డీఏ సభ్యులను పలకరించిన తర్వాత ప్రధాని ప్రతిపక్షాల స్థానాల వద్దకు వెళ్లి ఖర్గే, ములాయం, టిఎంసి నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ్, అన్నా డిఎంకె నాయకుడు తంబిదురై. ఆర్‌జెడి నాయకుడు జై ప్రకాశ్ నారాయణ్ యాదవ్ తదితరులను పలకరించారు. మోదీ ప్రతిపక్షాల స్థానాల వద్దకు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ సభలో లేరు. మోదీ, ములాయం, బిజెపి సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషీలు ఏదో విషయం చర్చించుకుంటూ, హృదయపూర్వకంగా నవ్వుకోవడం కనిపించింది. బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీని సైతం ప్రధాని పలకరించారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, మరికొందరు బిజెపి నేతలు కూడా ప్రతిపక్ష స్థానాల వద్దకు వెళ్లి వారిని పలకరించడం కనిపించింది. రాజ్యసభలో సభా నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ప్రతిపక్షాల బెంచీల వద్దకు వెళ్లి గులాం నబీ ఆజాద్, శరద్ యాదవ్, ఆనంద్ శర్మ, సీతారాం ఏచూరి, మాయావతి సహా ప్రతిపక్ష నేతలందరినీ పేరుపేరున పలకరించారు. రాజ్యసభలో మెజారిటీ లేని కారణంగా ప్రభుత్వం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలనుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవడం, జిఎస్‌టి బిల్లుసహా పలు కీలక బిల్లులను ప్రతిపక్షాలు అడ్డుకోవడం తెలిసిందే. అయితే ఈసారి సమావేశాల్లో రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నిటినీ ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉండడమే కాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం తెలిసిందే.