క్రీడాభూమి

పిస్టోరియస్ హంతకుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్ధారించిన దక్షిణాఫ్రికా సుప్రీం కోర్టు

బ్లూంఫొంటైన్, డిసెంబర్ 3: పారాలింపిక్ అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్‌ను హంతకుడిగా దక్షిణాఫ్రికా సుప్రీం కోర్టు నిర్ధారించింది. తనికి విధించాల్సిన శిక్షను ఖారారు చేయాల్సిందిగా కేసును ట్రయల్ కోర్టుకు బదిలీ చేసింది. 2013 ఫిబ్రవరి 14వ తేదీన తన గర్ల్‌ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్‌ను పిస్టోరియస్ హత్య చేశాడు. ‘బ్లేడ్ రన్నర్’ అన్న పేరుతో క్రీడా ప్రపంచానికి సుపరచితుడైన అతను కోర్టులో తాను నిర్దోషినని వాదించాడు. ఆగంతులు ఎవరో ఇంట్లోకి చొరబడ్డారని అనుమానించి కాల్పులు జరిపానని, అయితే, అక్కడ తన గర్ల్‌ఫ్రెండ్ రీవా ఉందనే విషయం తనకు తెలియదని వివరణ ఇచ్చాడు. బాత్రూమ్‌లో అలికిడి వినిపించడంతో బయట నుంచే కాల్పులు జరిపిన పిస్టోరియస్‌కు రీవాను హత్య చేయాలన్న ఉద్దేశం లేదని ట్రయర్ కోర్టు అభిప్రాయపడింది. అనుమతి లేకుండా ఆయుధాన్ని కలిగి ఉండడం, దానిని ఉపయోగించడం వంటి అభియోగాలపై అతనికి ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఏడాది జైలును పూర్తి చేసుకున్న పిస్టోరియస్ గత నెల పెరోల్‌పై విడుదలయ్యాడు. అయితే, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సుప్రీం కోర్టు అతనిని దోషిగా పేర్కోవడం సంచలనం రేపింది. నిర్దోషిగా బయటపడతానన్న ఈ వికలాంగ స్ప్రింటర్‌కు ఇప్పుడు దాదాపుగా అన్ని దారులు మూసుకుపోయాయి. బ్లూంఫొంటైన్‌లోని సుప్రీం కోర్టులో న్యాయమూర్తి ఎరిక్ లీచ్ తీర్పును వెల్లడించిన సమయంలో పిస్టోరియస్ అక్కడ లేడు. పెరోల్‌పై విడుదైన అతను ప్రిటోరియాలోని తన పినతండ్రి ఇంట్లో ఉంటున్నాడు. తీర్పు నేపథ్యంలో పోలీసులు అతనిని గృహ నిర్బంధంలో ఉంచే అవకాశం ఉంది. కాగా, ప్రాసిక్యూషన్ అభియోగాలకు పిస్టోరియస్ ఇచ్చిన వివరణ, చేసిన వాదన తప్పులతడకగా ఉందని న్యాయమూర్తి లీచ్ అభిప్రాయపడ్డాడు. పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పాడని వ్యాఖ్యానించాడు. ఒక బలమైన ఆయుధంతో కాల్పులు జరిపితే, లోపల ఉన్న వ్యక్తి మృతి చెందుతాడన్న విషయం అతనికి తెలియంది కాదని అన్నాడు. లోపల ఎవరున్నారనే అంశాన్ని పక్కకు ఉంచినా, ఎవరున్నా కాల్పుల కారణంగా తీవ్రంగా గాయపడడం లేదా మృతి చెందడం జరుగుతుందని పిస్టోరియస్‌కు తెలుసునని అన్నాడు. ఈ వాస్తవం తెలిసే అతను కాల్పులు జరిపాడని వివరించాడు. ఈ కోణంలో చూస్తే అతను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే అత్యాధునిక తుపాకీతో కాల్పులు జరిపాడని అన్నాడు. పిస్టోరియస్ వాదనతో ఏకీభవించేందుకు ఏ ఒక్క అంశం కూడా లేదని అన్నాడు. శిక్షను ఖరారు చేసే బాధ్యతను ట్రయల్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇలావుంటే, ట్రయల్ కోర్టు తీర్పు వెలువడే వరకూ పిస్టోరియస్ గృహ నిర్బంధంలో ఉండాల్సి వస్తుంది. అతనికి 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశాలున్నాయి. అయతే అతను రివ్యూ ట్రిబ్యు నల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు.