జాతీయ వార్తలు

ఇద్దరు ప్రతిపక్ష నేతలకు ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్‌లో హై అలర్ట్ బలగాల మోహరింపు బంద్‌కు పిలుపునిచ్చిన జమాతే

ఢాకా, నవంబర్ 22: బంగ్లాదేశ్‌లో ప్రతిపక్షానికి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులకు ఆదివారం ఉరిశిక్ష అమలు చేశారు. క్షమాభిక్ష కోసం ఈ ఇద్దరు నేతలు చివరివరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. క్షమాభిక్ష అభ్యర్థనను అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ తిరస్కరించడంతో ఆదివారం మధ్యాహ్నం భారీ భద్రత మధ్య 12.45కు ఉరిశిక్ష అమలుచేశారు. జమాతే ఇస్లామి సెక్రటరీ జనరల్ అషన్ మొహమ్మద్ ముజాహిద్ (67), బిఎన్‌పి నాయకుడు సలావుద్దీన్ ఖదీర్ చౌధురి (66)లకు ఉరిశిక్ష అమలుచేసినట్లు జైలు అధికారి ఒకరు వెల్లడించారు. యుద్ధ నేరాలకు పాల్పడిన నేరస్థుల్లో ఇప్పటివరకు వీరిద్దరు మాత్రమే క్షమాభిక్ష కోరడం, వాటిని అధ్యక్షుడు తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలుకు ఏర్పాట్లు వెంటవెంటనే జరిగిపోయాయి. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో నేరాలకు పాల్పడ్డారని బంగ్లా సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ, వీరిద్దరికీ ఉరిశిక్ష విధించిన సంగతి విదితమే. ఉరి అనంతరం వీరి మృతదేహాలను భారీ భద్రత మధ్య వారి స్వగ్రామాలకు తరలించారు. చిట్టగాంగ్‌లోని గోహిరా గ్రామంలో చౌధురి మృతదేహాన్ని ఖననం చేయగా, మొజాహిద్ మృతదేహాన్ని ఫరీద్‌పూర్‌లోని పోచిమ్ ఖబాష్‌పూర్ గ్రామంలో ఖననం చేసినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ప్రతిపక్షానికి చెందిన ఇద్దరు సీనియర్ నేతలకు ఉరిశిక్ష అమలుచేయడంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఉరిశిక్ష అమలు చేసినట్లు వార్తలు వెలువడగానే ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మరోపక్క, దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉండటంతో భద్రతను మరింత పటిష్టం చేశారు. తమ పార్టీ సీనియర్ నేతకు ఉరిశిక్ష అమలుచేయడంతో సోమవారం నాడు జమాతే ఇస్లామి బంద్‌కు పిలుపునిచ్చింది. 1971 డిసెంబర్ 16 జరిగిన యుద్ధానికి ముందు జరిగిన ఊచకోతకు ముజాహిద్ సూత్రధారి అని నిర్ధారణ అయింది. బిఎన్‌పి అధినేత్రి ఖలీదా జియాకు సన్నిహితుడైన చౌధురి పార్టీలో సీనియర్ నేత. చిట్టగాంగ్‌లోని తన నివాసం నుంచి హిందువులకు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలకు పాల్పడ్డాడని రుజువైంది. చౌధురి ఆరుసార్లు ఎంపిగా గెలవడం విశేషం. దీంతో ఈ ఇద్దరు నేతలకు ఉరిశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం విదితమే. 1971నాటి యుద్ధనేరాలకు సంబంధించి ఇప్పటివరకు నలుగురికి ఉరిశిక్ష అమలుచేశారు. గతంలో అబ్దుల్ ఖాదిర్ మొల్లా, మొహమ్మద్ కమారుజ్జామన్‌కు ఉరిశిక్ష అమలుచేశారు.