జాతీయ వార్తలు

రూ.20 లక్షల్లోపు టర్నోవర్‌ ఉన్నవారికి జీఎస్‌టీ నుంచి మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశంలో వస్తు సేవలపన్ను(జీఎస్‌టీ) అమలుకు సంబంధించి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన రెండో రోజూ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఎంత ఆదాయ పరిమితిని విధించాలనే దానిపై చర్చించారు. ఆదాయ పరిమితిని రూ.20లక్షలుగా నిర్ణయించినట్లు జైట్లీ వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల్లో ఉన్న వారికి ఈ పరిమితిని రూ.10లక్షలుగా ఖరారు చేసినట్లు తెలిపారు. వ్యాపారుల వార్షిక ఆదాయం ఈ పరిమితి కన్నా తక్కువగా ఉంటే ప్రత్యక్ష పన్నుల పరిధిలోకిరారు. రూ.20లక్షల టర్నోవర్‌ పైబడిన వారికి జీఎస్‌టీ వర్తించనుంది. జీఎస్‌టీ కౌన్సిల్‌ సెప్టెంబర్‌ 30న మరోసారి సమావేశం కానుంది.