జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించాలని సుప్రీంలో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: శాంతిభద్రతలు మృగ్యమైనందున జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో తక్షణం గవర్నర్ పాలన విధించాలంటూ పాంథర్స్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం నాడు విచారణకు సుప్రీం కోర్టు స్వీకరించింది. వచ్చే వారం ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. జమ్ము-కాశ్మీర్ చట్టంలోని ఓ నిబంధన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానిని ఇటీవల భద్రతాదళాలు హతమార్చిన అనంతరం జమ్ము-కాశ్మీర్‌లో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. నిత్యం అల్లర్లు, బంద్‌లతో పలు చోట్ల జన జీవనం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలూ సహకరించాలని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై అఖిలపక్ష సమావేశంలో ఆమె కంటతడిపెట్టారు.