జాతీయ వార్తలు

బిజెపికి కలాం బంధువు గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ రాష్టప్రతి నివాసాన్ని స్మారక చిహ్నంగా మార్చనందుకు నిరసన

న్యూఢిల్లీ, నవంబర్ 23: రాజకీయాలతో సంబంధం లేకుండా తనకున్న అపారమైన సాంకేతిక పరిజ్ఞానంతో దేశానికి ఒక గుర్తింపు తెచ్చిన దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలామ్ నివసించిన ఇంటిని స్మారక చిహ్నంగా మార్చటానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినందుకు నిరసనగా ఆయన సోదరుని కుమారుడు సయ్యద్ ఇబ్రహీం బిజెపికి రాజీనామా చేశారు. తమ కుటుంబ సభ్యులేకాక యావత్ భారతచేశం ఆశించిన ఈ డిమాండ్‌ను తిరస్కరించి ప్రభుత్వం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు పంపిన రాజీనామా లేఖలో వివరించారు. వివిధ రంగాలలో కలామ్ సాధించిన ఘనవిజయాలు, సాంకేతిక రంగంలో ఆయనకున్న దూరదృష్టి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచే విధంగా ఆయన నివసించిన ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్ద వలసిందిగా తాము చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించటంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టప్రతి భవన్ ఖాళీచేసిన తరువాత కలామ్‌కు ప్రభుత్వం రెండు అంతస్థుల భవనాన్ని కేటాయించింది.
రాజాజీ మార్గ్‌లో తనకు లభించిన ఈ నివాస గృహాన్ని కలామ్ ఒక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దారు. కలామ్ ఢిల్లీలో ఉన్నప్పుడు యువతతోనేకాక వివిధ రంగాలకు చెందిన వారితో ఆయన తన అనుభవాలను పంచుకుంటూ సాంకేతిక రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడేవారు. ఆయన చనిపోయిన తరువాత ఈ ఇంటిని పట్టణాభివృద్ధి శాఖ నియమ నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేశ్ శర్మకు కేటాయించింది. అయితే ఈ భవనాన్ని ఒక స్మారక చిహ్నంగా మార్చి భావి తరాలకు స్ఫూర్తిగా మిగిలిపోయేట్లు చూడవలసిందిగా కలామ్ కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పట్టించుకోలేదు. సయ్యద్ ఇబ్రహీం 2012లో బిజెపిలో చేరారు. చనిపోయిన ప్రముఖులు నివసించిన గృహాలను స్మారక చిహ్నాలుగా అభివృద్ధి చేయరాదని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జగ్జీవన్ రామ్ నివసించిన ఇంటిని ఒక స్మారక చిహ్నంగా మార్చుకుని ఆయన కుమార్తె, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ తన సొంత ఆస్తిలా అనుభవిస్తున్నారు. తన తండ్రి చరణ్‌సింగ్ నివసించిన ఇంటిని ఖాళీచేయటానికి నిరాకరించటమేకాక తన మద్దతుదారులతో మాజీ మంత్రి అజిత్‌సింగ్ ప్రదర్శనలు నిర్వహించి విఫలమయ్యారు. అనంతరం ప్రభుత్వం ఆయనను బలవంతంగా బయటకు పంపించింది.