క్రీడాభూమి

గంభీర్ సారథ్యంలో కోహ్లీ, ధావన్ ఆట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ప్రీమియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, స్పీడ్‌స్టర్ ఇశాంత్ శర్మ విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడనున్నారు. ఈ టోర్నీలో భాగంగా ఈ నెల 10-18 తేదీల మధ్య నార్త్‌జోన్ లెగ్ పోటీల్లో పాల్గొనే ఢిల్లీ జట్టులో వీరికి చోటు చోటు కల్పించారు. టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకునేందుకు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న సీనియర్ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తాడు. ప్రస్తుతానికి భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అంతర్జాతీయ సిరీస్ జరిగే అవకాశాలు లేకపోవడం, అలాగే పరిమిత ఓవర్ల ముక్కోణ సిరీస్‌లో ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఇంకా నెల రోజుల వ్యవధి ఉండటంతో కోహ్లీ, ధావన్, ఇశాంత్‌లను ఢిల్లీ జట్టుకు ఎంపిక చేశారు. ఒకవేళ అనుకోని పరిణామాలేవైనా చోటుచేసుకుని భారత్, పాక్‌ల మధ్య సిరీస్ జరిగినట్లయితే ఢిల్లీ జట్టులో వీరి స్థానాలను భర్తీ చేసేందుకు ధ్రువ్ శౌరీ, వైభవ్ రావల్, వికాస్ తొకాస్‌లను స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. వీరిలో కోహ్లీ తరఫున వైభవ్ రావల్, శిఖర్ ధావన్ తరఫున ధ్రువ్ శౌరీ, ఇశాంత్ శర్మ తరఫున వికాస్ తొకాస్‌లను బరిలోకి దింపుతారు.
అయితే టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటే ఢిల్లీ జట్టుకు అతడినే కెప్టెన్‌గా ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నకు వినయ్ లాంబా నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. అంతర్జాతీయ ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చని భావించి ప్రస్తుత సీజన్ మొత్తానికీ గౌతమ్ గంభీర్‌నే కెప్టెన్‌గా ప్రకటించడం జరిగిందని, అయినా గంభీర్ సారథ్యంలో కోహ్లీ ఆడటాన్ని ఎవరూ తప్పుపడతారని భావించడం లేదని శుక్రవారం సెలెక్షన్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం లాంబా పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు.
ఢిల్లీ జట్టు ఇదీ
గౌతమ్ గంభీర్ (కెప్టెన్), ఉన్ముక్త్ చాంద్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, నితీష్ రాణా, మిలింద్ కుమార్, మనన్ శర్మ, పవన్ నేగీ, ఆశిష్ నెహ్రా, ప్రదీప్ సంగ్వాన్, ఇశాంత్ శర్మ, నవ్‌దీప్ సైనీ, సుబోధ్ భాటీ, శివమ్ శర్మ, రాహుల్ యాదవ్ (వికెట్‌కీపర్).
స్టాండ్‌బై ఆటగాళ్లు: ధ్రువ్ శౌరీ (శిఖర్ ధావన్), వైభవ్ రావల్ (విరాట్ కోహ్లీ), వికాస్ తొకాస్ (ఇశాంత్ శర్మ).