జాతీయ వార్తలు

కోల్‌కతలో ఫ్లయ్‌ఓవర్ కూలి 14 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: నగరంలోని ఉత్తర ప్రాంతంలో గిరీష్ పార్క్ వద్ద గురువారం నిర్మాణంలో ఉన్న ఫ్లయ్‌ఓవర్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. శిథిలాల తొలగింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. శిథిలాల కింద కనీసం 200 మంది చిక్కుకున్నారన్న వార్తలు రావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. బుధవారం చేపట్టిన పనులకు సంబంధించి నిర్మాణాలు మరుసటిరోజునే కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. పనుల్లో సిమెంటు తగినంతగా వాడలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘటన స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.