ఫ్లాష్ బ్యాక్ @ 50

భలే మొనగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.మల్లిఖార్జునరావు, తొలుత ‘కొడుకులు-కోడళ్ళు’ డబ్బింగ్ చిత్రం నిర్మించారు. తరువాత మధు పిక్చర్స్ బేనర్‌పై జ్వాలాదీప రహస్యం, ఇద్దరు మొనగాళ్ళు, ‘మంచి కుటుంబం’, ‘మంచి మిత్రులు’, ‘ఇంటి గౌరవం’, ‘ఇంటి కోడలు’(1974) నిర్మించారు. సునందిని పిక్చర్స్ పతాకంపై 1968లో ‘్భలే మొనగాడు’ రూపొందించారు. ఆ తరువాత హిందీ చిత్రసీమలోను పలు చిత్రాలు రూపొందించి, విజయవంతమైన నిర్మాతగా పేరుపొందారు.
‘్భలే మొనగాడు’ చిత్రానికి జానపద బ్రహ్మగా వాసిగాంచిన శ్రీ బి.విఠలాచార్య దర్శకత్వం వహించారు. కథ, మాటలు: వీటూరి, సంగీతం- ఎస్.పి.కోదండపాణి, నృత్యం- చిన్ని, సంపత్, స్టంట్స్- ఇ.పరమశివం, కళ- బి.నాగరాజు, కూర్పు- బి.కందస్వామి, ఛాయాగ్రహణం- హెచ్.ఎస్.వేణు, స్పెషల్ ఎఫెక్ట్స్- రవికాంత్ నగాయిచ్, నిర్మాత- పి.మల్లిఖార్జునరావు. 12-07-1968 విడుదల.
విజేతపుర మహారాజు (జూనియర్ ఏ.వి.సుబ్బారావు). రాకుమార్తె, వైశాలిదేవిని వివాహం చేసుకోవాలని, గోకర్ణుడు (రామదాసు) వికర్ణుడు (వి.జె.శర్మ) రాజ్యానికి వస్తారు. జగన్మాతను పూజించి నిర్ణయం చెబుతానన్న రాకుమారికి ఆలయంలో ఒక చిలుక కన్పించి, రేపు సభలో మాత నిర్ణయం చెబుతుందని తెలియచేస్తుంది. ఆలయంలో రాకుమారికి విజయసేనుడు (కాంతారావు) అనే యువకుడు పరిచయమై, ఆమె ప్రేమను పొందుతాడు. మరునాడు రాజ్యసభలో వరులిద్దరూ, సభాసదులు వుండగా చిలకవచ్చి భోగాపురంలోగల మాట్లాడే పువ్వు, రాగాపురంలోని సంగీతం పాడే కొమ్మ పెనుశిల కాట్లాడే బొమ్మ, ఈ మూడు విచిత్ర వస్తువులు ఎవరుతెస్తే వారిని రాకుమారి వివాహం చేసుకుంటుందని, దేవి ఆనతిగా ప్రకటిస్తుంది. 1 ఏడాది గడువులోగా వాటిని తెస్తామని గోకర్ణ, వికర్ణులు, విజయసేనుడు బయలుదేరుతారు. విజయసేనుడు, తన మేనత్త కొడుకు అని తెలిసికొన్న వైశాలి (కృష్ణకుమారి) ఆనందిస్తుంది. విజయుడు, తన స్నేహితుడు ప్రేమికుడు (చలం)తో బయలుదేరి, దారిలో ఓ మండూకుని, అతని కుమార్తె బిజిలి (విజయలలిత)ని కలుస్తారు. వారి సాయంతో ఈ వస్తువుల జాడ గ్రహించి తొలుత సంధ్యారాణి వద్దగల మాట్లాడే పువ్వును, ఆపైన గీతాంజలి, ఆమె అన్నవద్దగల సంగీతం పాడే కొమ్మను, ఆ తరువాత, తన గానంతో పెను శిలను కరిగించి కాట్లాడే బొమ్మను సాధించి మహారాజుకు చూపటం, వీటిపై ఆశపడి చిలక రూపంలో వీటిని కోరిన ఘంటా భైరవుడు (త్యాగరాజు) వాటిని విజయసేనునివద్దనుంచి తస్కరించటం, తిరిగి విజయుడు తనకు తెలిసి పరాక్రమంతో వాటిని నాశనంచేసి, ఆ మాంత్రికుని అంతంచేయటం జరుగుతుంది. వైశాలినియొక్క తప్పిపోయిన సోదరి బిజిలి అని తెలిసాక, వైశాలికి, బిజిలికి, విజయసేనునితో వివాహం జరిగి అందరూ ఆనందించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో ఇంకా జూ.్భనుమతి, మోదుకూరి సత్యం, పొట్టివీరన్న తదితరులు నటించారు.
దర్శకులు శ్రీ విఠలాచార్య అలరించేలా సన్నివేశాలు తీర్చిదిద్దారు. తొలుత విజయుడు సాధారణ వ్యక్తిగా జగన్మాత ఆలయంవద్ద సైనికులతో, శౌర్యం వెల్లడి అయేలా ఒంటరి పోరాటం, విచిత్ర వస్తువులకోసం వెళ్ళేముందు తన తల్లి మహారాజు సోదరి అని తెలిసికోవటం. మహారాజు తల్లిని అవమానించినందుకు బదులుతీర్చుకుంటానని చెప్పటం, ఆ మాటలు చాటునుంచి విన్న రాకుమారి, విజయుడు ఆశయం మెచ్చటం, మేనత్తను గౌరవించటం. ఇక విచిత్ర వస్తువుల సంపాదనలో మండుకరాజుకు మాట ఇచ్చి, అతని వద్దనుంచి ‘్ధమాళి’ అను శక్తిసాయంతో మాట్లాడే పువ్వును సాధించి పాట పాడే కొమ్మగల రాక్షసుని సోదరి గీతాంజలితో నృత్య గీతం, ఆ రాక్షసునితో ఒంటరిగా పోరాడి, అతన్ని సంహరించి పాడే కొమ్మ చేపట్టడం, తిరిగి పెనుశిలను తన గంధర్వ గానంతో కరిగించటం. (జగదేకవీరుని కథ బిట్) కాట్లాడే బొమ్మ భీకర ఆకారం విజయసేనునికి భవంతి నిర్మించటం, దానిలో వింతలు గోడపైన పటంలో యువకుల సర్కస్ ఫీట్స్, అలాగే మరో పటంలో చిలకల విన్యాసాలు, ‘నిచ్చెన ఎక్కటం’ తాటిపై నడవడం, రింగులో దూరటం వంటి తమాషాలు చిత్రం చివరలో తిరిగి, త్యాగరాజు ఆ భవనాన్ని నాశనం చేయించటం. త్యాగరాజుతో వైశాలి (కృష్ణకుమారి) విజయలలిత (బిజిలి)లతో, డాన్స్ దాని తరువాత విజయుడు మాట్లాడే పువ్వు నడిగి, దాన్ని కాల్చివేయగా, మిగిలిన పాడే కొమ్మ, కాట్లాడే బొమ్మ అగ్నికి ఆహుతికావటం మాంత్రికుడు త్యాగరాజుతో విజయుడు పలువిధాల పోరాడి అతని ఎడమపాదంలో గల కన్ను నాశనం చేసి అతన్ని వధించటం. పూర్వం యోగిఅయిన మండుకరాజుకు నిజరూపం రావటం. ఈ సన్నివేశాలను ఎంతో పట్టుతో చిత్రీకరించి, తన జానపదబ్రహ్మ బిరుదును సార్థకం చేసుకున్నారు. విజయసేనునిగా కాంతారావు సన్నివేశానుగుణంగా ప్రియురాలితో ప్రేమనూ, పోరాటాల్లో ప్రత్యేకశ్రద్ధను చక్కగా నటనలో చూపారు. మిగిలిన పాత్రధారులు పాత్రోచితంగా మెప్పించారు. స్పెషల్ ఎఫెక్ట్స్ రవికాంత్ నగాయిచ్ కాట్లాడే బొమ్మ విన్యాసాలు ఎఫెక్టివ్‌గా రూపొందించటం విశేషం. సందర్భోచితమైన రచనతో వీటూరి ఆకట్టుకోగా కోదండపాణి గీతాలకు తగ్గ యుక్తమైన స్వరాలందించారు.
చిత్ర గీతాలు: ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ, యుగళ గీతం నేటికీ అలరించేలా చిత్రీకరణ సాగింది. కృష్ణకుమారి దేశాటనకు వెళ్ళే విజయసేనునికి మధ్య సాగిన ప్రణయ గీతం ‘ఏ ఊరు నీ పయనం చక్కని మగరాయా ఏ భామ’ (పి.సుశీల, ఘంటసాల-ఆరుద్ర). ఆరుద్ర వ్రాసిన మరో గీతం గీతాంజలి నృత్యం, కాంతారావు ముందు ‘ఇంద ఇంద తీసుకో’(పి.సుశీల) సి.నారాయణరెడ్డి వ్రాసిన రెండు గీతాలు ‘కృష్ణకుమారి, విజయలలిత, త్యాగరాజు ముందు పాడే పాట ‘కవ్వించేలేరా జువ్వను లేలేరా’(గానం -పి.సుశీల, జిక్కి) మరో గీతం పెనుశిలను కాంతారావు కరిగించే గీతం ‘‘మనిషి తలచుకుంటే గిరులు ఝరులు పొంగవా’(గానం- ఘంటసాల) మానవుని శక్తియుక్తులను తెలియచెప్పే సాధికార, ఘంటసాల గానంతో విలసిల్లిన గీతం) సంధ్యారాణిపై చిత్రీకరించిన నృత్య గీతం ‘ఏలుకొనురాజు ఎప్పుడొస్తాడో’(పి.సుశీల బృందం-దాశరథి) దాశరథి మరో గీతం విజయలలిత, కాంతారావులపై చిత్రీకరణ ‘సిన్నదాన్నిరా నీ సిన్నదాన్నిరా’ (పి.సుశీల).
‘‘్భలే మొనగాడు’’ చిత్రం కాంతారావు, విఠలాచార్య కాంబినేషన్‌లో వచ్చిన జానపద చిత్రాల కోవలో, కొన్ని అలరించే గీతాలు, ఫైట్స్‌తో కొన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందేలా రూపొందించబడి చక్కని కాలక్షేప చిత్రంగా నిలిచింది. జానపద చిత్రం కనుక వీటిలోని, విన్యాసాలు, ఎఫెక్ట్స్, పిల్లలను చక్కగా ఆకట్టుకున్నాయి. గ్రాఫిక్స్, యానిమేషన్స్ అంతగా లేని రోజుల్లోని ఈ చిత్రాలు, ప్రేక్షకులకు ఓ వెరైటీ చిత్రంగా నిలిచాయి. ‘్భలే మొనగాడు’ అదేస్థాయి చిత్రంగా పేర్కొనాలి.

- ఎస్.వి.రామారావు -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి