క్రీడాభూమి

ఫిట్నెస్‌పై స్పష్టత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్
అడెలైడ్, నవంబర్ 30: తన ఫిట్నెస్‌పై ప్రస్తుతానికి స్పష్టత లేదని, అయితే గాయం నుంచి కోలుకోవడానికి కనీసం నెల రోజులు పడుతుందని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆడుతున్నప్పుడు అతని కుడి కాలి మడమ చిట్లింది. క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి డై/నెట్ టెస్టుగా ముద్రపడిన ఆ మ్యాచ్‌లో స్టార్క్ తొమ్మిది ఓవర్లు బౌల్ చేశాడు. కాలి మడమ గాయం కారణంగా అతను మైదానాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎక్స్‌రేలో కాలి ఎముక చిట్లిందని స్పష్టమైంది. గాయం త్వరగా తగ్గేందుకు ప్రత్యేక బూట్లను, బరుపు పడకుండా ఉండేందుకు ఊతకర్రలను వాడుతున్న స్టార్క్ సోమవారం విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఇంటికి వెళ్లిన తర్వాత వైద్య నిపుణులను సలహా తీసుకుంటానని అన్నాడు. ప్రస్తుతం నెల రోజుల విశ్రాంతి సరిపోతుందని అడెలైడ్‌లో వైద్యులు పేర్కొన్నట్టు చెప్పాడు. పూర్తిస్థాయి వైద్య పరీక్షల తర్వాతగానీ ఎంతకాలం విశ్రాంతి అవసరమన్న విషయంపై స్పష్టత రాదని స్టార్క్ చెప్పాడు. ప్రస్తుతానికి తాను చెప్పగలిగింది ఏమీ లేదని అన్నాడు. త్వరగా కోలుకొని మళ్లీ జాతీయ జట్టులోకి వస్తానని 25 ఏళ్ల స్టార్క్ తెలిపాడు. ఇటీవలే మరో పేసర్ మిచెల్ జాన్సన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో, కొత్త బంతితో దాడులకు ఉపక్రమించే బాధ్యత స్టార్క్‌పై పడింది. ఇప్పటి వరకూ 25 టెస్టులు ఆడిన అతను 91 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో అతను గంటకు 160.4 కిలోమీటర్ల వేగంతో బంతిని వేసి రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నాడు.