క్రీడాభూమి

ఫేవరిట్ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నేడు బంగ్లాదేశ్‌తో అండర్-19 ట్రై సిరీస్ ఫైనల్
కోల్‌కతా, నవంబర్ 28: బంగ్లాదేశ్‌తో ఆదివారం జరగనున్న అండర్-19 ట్రై సిరీస్ ఫైనల్‌లో భారత్ హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అండర్-19 వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్న భారత్‌కు ప్రస్తుత ట్రై సిరీస్ ప్రాక్టీస్ ఈవెంట్‌గా ఉపయోగపడుతున్నది. ఈ టోర్నీలో భారత్ నాలుగు గ్రూప్ మ్యాచ్‌లు ఆడింది. రెండు పర్యాయాలు అఫ్గానిస్థాన్‌ను, మరో రెండు సార్లు బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విశే్లషణను పరిగణలోకి తీసుకుంటే ఆదివారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నది. కాగా, రెండు మ్యాచ్‌ల్లో భారత్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్ మిగతా రెండు గ్రూప్ మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్‌పై విజయాన్ని నమోదు చేసింది. తుది పోరులో భారత్‌ను ఈ జట్టు ఏ విధంగా ఢీ కొంటుందో చూడాలి.