ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1) ఈ వర్కింగ్ స్టిల్ సినిమా చెప్పండి?
2) మామగా ఎన్టీఆర్, అల్లుడిగా ఎస్వీఆర్... సినిమా పేరేంటో చెప్పండి?
3) ఒకటి డూడూ బసవన్న. రెండు తోట రాముడు.. రెంటికీ లింకున్న హీరో?
4) మొదటిది బలిదానం. తరువాతది యమకింకరుడు.. వీటి ఇంగ్లీష్ మాతృక పేరేంటో గుర్తు తెచ్చుకోండి?
5) మొదటిది తీర్పు.. రెండోది మార్పు.. ఏ దర్శకుడు జ్ఞప్తికొస్తున్నాడు?
6) బాబూ... చిట్టీ అంటూనే.. బంగాళా భౌ... భౌ మంటూ కడుపుబ్బ నవ్వించిన హాస్యనటి ఎవరు?
7) నీలీల పాడెద దేవా అంటూ అద్భుతమైన గమకాలు పలికించిన గొంతే, సామజవరగమనా మరో వినసొంపు పాట వినిపించింది. ఆ గొంతు ఎవరిది?
8) అప్పుడెప్పుడో యుగంధర్.. ఈ మధ్య ఉలవచారు బిర్యానీ---- సంగీత దర్శకుడు?
9) ఇటు ఇంద్ర.. అటు వనకన్య- వండర్ వీరుడు.. ఎవరా నాయిక?
10) ఈ ఫొటో చూస్తే గుర్తొచ్చే సినిమా పేరు?

నిర్వహణ: జి రాజేశ్వరరావు