వీరాజీయం

ఇదెక్కడి ‘ఉగ్రవాదం’రా, భగవంతుడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాస్టిల్ డే’ అన్నది ప్రెంచి విప్లవానికి ప్రతీకగా జాతీయ ఉత్సవంగా ఫ్రాన్స్ దేశం అంతటా హర్షోల్లాస ఆనందాతిరేకంతో జరుపుకునే జులై 14 - పర్వదినం కనులు మిరుమిట్లుగొలిపే బాణసంచా వెల్తురులలో శరీరంలోని అణువణువు పులకించి పెల్లుబికే ఉత్సాహం నీలాంబరాన్ని వర్ణనాతీత వర్ణ్భాసితంగా మెరిపిస్తున్న తరుణంలో ‘ఫ్రాన్స్’లోనే అందమయిన ఒక పెద్ద నగరం ‘నీస్’నగరం వీధులగుండా ఒక భీషణ, మారణ, దారుణ మృత్యుశకటం- 25 టన్నుల ట్రక్కురూపంలో- నూరు కిలోమీటర్ల వేగంతో కరాళ నృత్యం చేస్తూ జనాల్ని పచ్చడి పచ్చడిగా తొక్కేసిన సంఘటన- అతి దూరంగా వుండి- వార్తగా విన్నవారి గుండెల్నే పిండేసింది.
చిన్నా, పెద్దా-ఆడా మగా అందరూ- ఒక్కడుగు నడుచుకుంటూ వచ్చిన ఆ మారణాయుధ శకటం కింద ఆర్తనాదాలు, హాహాకారాలూ చేస్తూ దుర్మరణం చెందారు. ఎనభై మంది అన్నారు గానీ అది వంద అయినా కావొచ్చు. నీస్ నగరాన్ని ఇంగ్లీషులో నైస్ అని రాస్తారు. స్థానికంగా ‘నిస్సో’అని కూడా ప్రేమగా పిల్చుకుంటారు. అందమైన పది లక్షల జనాభాగల నగరం శాశ్వతంగా చరిత్రలో ఒక మృత్యుదినంగా మిగిలిపోయింది రుూ జూలై 14.
ఓరి దేవుఁడోయ్! ఇది ఎవరు రచిస్తున్న మారణకాండ? ఎందుకోసం? ట్రక్కు నడుపుతున్నవాడు 31 సంవత్సరాల ఫ్రెంచి ట్యునిషియా- ముస్లిమ్ పౌరుడు. అతని పేరు మహమ్మద్ లంపాలా యియేజ్ బొహ్లేవ్ అని పోలీసులు చెప్పారు. ట్రక్కు నిండా బాంబులు, తుపాకులు యింకా రకరకాల మారణాయుధాలున్నాయి. దాంతో జనాల్ని కప్ప పిల్లల్ని తొక్కేసినట్లు తొక్కేసింది- చాలక ఆ ఉగ్రరాక్షసుడు స్వయంగా గన్ తీసుకుని జనాల మీద గుండ్లవర్షం కురిపిస్తూ- తాను పోలీసు కాల్పులకు హతుడైనాడనీ- ‘‘అల్లా హో అక్బర్’’అంటూ నినాదాలు చేస్తూ దాడి కొనసాగించాడనీ- పోలీసులు, ప్రత్యక్షసాక్షులూ చెప్పారు.
ఇది ఐ.ఎస్. టెర్రరిస్టుల దుశ్చర్య అనే అధికారవర్గాలు రూఢి చేసుకున్నాయి. సరిగ్గా పారిస్ ఉగ్రవాద దాడులు జరిగి 120 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద బీభత్సం తరువాత యమర్జెన్సీలో వున్న ఫ్రాన్స్‌లో యమర్జెన్సీని ఎత్తివేద్దాం అని అధ్యక్షుడు అనుకుంటున్న తరుణంలో రుూ ఘోరం చోటుచేసుకోడం- ఎంత హృదయ విదారక విషాదం!
ఈ ఘోరం మేము చేసినదేనంటూ ఐ.ఎస్. వర్గాలు ప్రకటించకుండానే దొరికిన సాక్ష్యాలు, కంటబడ్డ ‘‘వెబ్‌సైట్’’ దృశ్యాలు రూఢి చేశాయి. ఐ.ఎస్. సానుభూతిపరులు దీన్ని ఆనందాతిరేకంతో ‘సెలబ్రేట్’చేసుకున్నారు.
ఆధునిక వైజ్ఞానిక ప్రగతికీ, నిఘా సాంకేతిక శక్తియుక్తులకి పేర్గాంచిన అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలే ఉగ్రవాదుల పన్నాగాలు, పంథాలు, ప్రణాళికలు, దాడి సన్నాహాలు వగైరాలు అంతుచిక్కకుండా అల్లాడుతూ వుంటే సాధారణ దేశాల గతి ఏమిటి?
‘‘ఓరి దేవుఁడా! ఉక్కుపాదం... ఉక్కుపాదం అంటూ అరుస్తారే గానీ- ఎక్కడ ఆ ఉక్కుపాదం? ఉక్రోషమే తప్ప’’-అంటూ అరిచాడో పెద్దాయన- మార్నింగ్‌వాక్ ఎవరో తరుముతున్నట్లు- ఉద్వేగంగా నడక సాగిస్తూ.
భారత పాలకులు, రాష్టప్రతి, ఫ్రాన్స్ సంఘటన పట్ల ప్రదర్శిస్తున్న సానుభూతి వార్తలు రుూ పౌరుణ్ని కలిచివేశాయి. మనిషిని మనిషిగా బతకనీయకుండా- కుల మతాదుల అడ్డుగోడలే ఒక రకంగా అంతులేని ఉగ్ర క్రీడలు అని అనుకుంటూ వుంటే అమాయక జనాల్ని అమానుషంగా వధించే రుూ ఉగ్ర క్రీడని ఏమని వర్ణించాలి?
ఆదినుంచీ యుద్ధాలు జరిగాయి. రామాయణ, భారతాలలో యుద్ధాలు జరిగాయి. క్రూసేడ్లు జరిగాయి. దేశాల మధ్య, జాతుల మధ్య దారుణ సమరాలు జరిగాయి. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. తిరుగుబాట్లు, విప్లవాలు, పితూరీలు యిలాంటి రకరకాల హింసాత్మక సంచలనాలు చరిత్రకీ, వర్తమానానికీ కొత్త ఏమీకాదు గానీ, యిదెక్కడి యుద్ధనీతి? వర్ణ విచక్షణలు చూస్తున్నాం వర్గ విచక్షణలు భరిస్తున్నాం. కానీ దేనికోసం? రుూ హింసాకాండ? సామాన్యుడి మీద కక్ష ఎందుకు?
దేశాలన్నీ పాలకుల రూపంలో రుూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, కలిసికట్టుగా అరుస్తూనే వున్నాయి. శనిగ్రహం అనే దాని ఉపగ్రహం- టైటానిక్‌లో మనుషులున్నారు అంటూ గొప్ప పరిశోధన చేసి జెబ్బలు చరుచుకుంటున్న విజ్ఞాన దీపం కింద నీడలాగా పొంచివున్న రుూ పైశాచిక దొంగ యుద్ధం మీద వేగుల చేష్టలు ప్రదర్శించలేకపోతున్నదేం?
తాత్విక చింతన పెరిగింది అంటున్నారు. అన్ని దేశాలలో.. కానీ ఉగ్రవాదులు కూడా ఉద్యమం పేరిట నిరపరాధులు అయిన తమ సోకాల్డ్ సైనికుల్ని మృత్యుగహ్వరంలో తోస్తున్నారు. వాళ్లు బావుకుంటున్నదీ లేదు. ఓ మనిషిని మరో మనిషి ఎందుకంత ద్వేషించాలి?? ప్రేమ కాదు గుడ్డిది- ద్వేషం, అసూయ, రుూర్ష్య- యివే గుడ్డివి. ఈ ద్వేషానికి ఆజ్యం ఆయుధాలకి పెట్టుబడులు, వత్తాసు దొరికిపోతున్నాయి. కానీ, ఎలాగ? ఎక్కణ్నుంచి వస్తున్నాయి? ఈ వృథాన్యార్ధ భంగులు తామేమయినా సుఖపడుతున్నారా? దిక్కులేని చావుకి గురిఅవుతున్నారు. దానికి బాధ్యులు ఎవరు? ఎవరు?
‘ఓ గాడ్! వేరార్యూ? ఇఫెటాల్ యుఆర్!’