మెయన్ ఫీచర్

వ్యవసాయం ముసుగులో పన్నుల ఎగవేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంటలు దెబ్బతినడం, తలకు మించిన అప్పుల భారం, దుర్భర దారిద్య్రాన్ని తట్టుకోలేక దేశంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతులు మాత్రమే మనకు తెలుసు. అటువంటప్పుడు రైతుల్లో కోటీశ్వరులున్నారని ఎవరైనా అంటే మనం వారిని వెర్రిబాగులవాళ్ల కింద జమకట్టడం సహజ మే కదా! కాని అశ్చర్యమనిపించినా, దేశంలో సుమారు ఎనిమిది లక్షలమంది ధనిక రైతులు తమ లక్షలాది రూపాయల ఆదాయం కేవలం వ్యవసాయం ద్వారానే సమకూరిందంటూ ప్రభుత్వానికి నివేదించారు! ఇదేంటి? దేశంలో రైతుల స్థితిగతుల్లో ఇంతటి పెనుమార్పు చోటుచేసుకున్నదా? రైతుల బతుకుల్లో ఇంతటి పరిణామం రావడానికి, వ్యవసాయంలో ఏమైనా సాంకేతిక పరమైన విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయా? అన్న అనుమానం కలగడం సహజమే. కానీ అటుంవంటిదేమీ లేదు. ఈవిధంగా చూపడంలో ఓ పెద్ద కుంభకోణం దాగుంది! దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా బైటపెట్టారు. ఆవిధంగా తమ ఆదాయాలను చూపిన ధనిక రైతులను విచారిస్తే అసలు బండారం బయటపడింది. కేవలం పన్నులు ఎగ్గొట్టడానికే వారు ఈ విధంగా దొంగ లెక్కలు చూపారని ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు తెలిపారు. ఒకవేళ ఇటువంటి వారి పేర్లు బయటపెడితే, రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ తమపై అభాండాలు వేయవద్దని కూడా అరుణ్ జైట్లీ విపక్షాలను కోరడం ఈ సందర్భంగా గమనార్హం.
ఇక్కడ అసలు వాస్తవమేమంటే, వ్యవసాయ ఆదాయానికి పన్ను ఉండదు. దీన్ని ఆసరాగా తీసుకొని కొందరు ప్రబుద్ధులు వ్యవసాయం ముసుగులో తాము ఇతర మార్గాల ద్వారా సంపాదించిన ధనానికి ప న్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నా రు. అసలు వ్యవసాయంపై వచ్చిన నికరాదాయ వివరాలు కావాలంటూ ఆదాయపు పన్ను మాజీ చీఫ్ కమిషనర్ విజయ్ శర్మ సమాచార హక్కు కింద ప్రభుత్వాన్ని కోరినప్పుడు ఈ వివరాలు బయట పడ్డాయ. వచ్చిన సమాధానం చూసి నోరు వెళ్లబెట్టడం ఆయన వంతైంది. 2010-11 ఆర్థిక సంవత్సరాల్లో దేశంలో నమోదైన వ్యవసాయ ఆదాయం రెండు లక్షల కోట్లు! ఇది భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) కంటె 20 రెట్లు అధికం! అదే మరుసటి సంవత్సరం అంటే 2012-13లో అది జిడిపి కంటె ఆరు రెట్లు అధికంగా నమోదైంది! మరి వ్యవసాయంపై ఇంతటి స్థాయిలో ఆదాయం లభిస్తున్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతున్నదంటే, అందుకు కారణం కేవలం ఇటువంటి ‘నకిలీ వ్యవసాయదారులు’ వెల్లడించిన వివరాల వల్ల మాత్రమే!పార్లమెంటులో చాలామంది విపక్ష నేతలు ఇటువంటి స్కాంపై విస్పష్టమైన విచారణ జరపాలని కోరారు. అయితే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపి రామ్‌గోపాల్ యాదవ్ మాత్రం..వ్యవసాయంపై ఎట్టిపరిస్థితుల్లో పన్నులు విధించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వెల్లడవుతున్న వాస్తవాలు చూస్తుంటే మన మెదడు మొద్దుబారిపోక మానదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో దాదాపు నాలుగు లక్షల మందికి పైగా, వ్యవసాయాదాయం కింద పన్ను మినహాయింపును కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారట! ఈ విషయంలో పెద్ద మొత్తంలో లబ్ది పొందిన వారు కావేరీ సీడ్స్, బహుళజాతి సంస్థ మోన్‌శాంటో ఇండియా. ఈ రెండు సంస్థలు వరుసగా రూ.186.63 కోట్లు, రూ. 94.40 కోట్లు పన్ను మినహాయింపు కోరాయి. మరి ఈ రెండు సంస్థలు పన్ను చెల్లించకముందు ఆర్జించిన లాభాలు వరుసగా రూ.215.36 కోట్లు, రూ.138.74 కోట్లు! అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించడం సముచితం. కొన్ని వ్యవసాయ-కంపెనీలు పెంచే పంటలకు పన్నుమినహాయింపు ఉంటుంది. అంటే వీరు ఇతర రైతులకు మాదిరిగానే పన్ను మినహాయింపు పొందేందుకు అర్హులు. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రత్యేక పంటలపై పన్ను విధిస్తున్నాయి.
పార్థసారథి షోం నేతృత్వంలోని ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్ కమిషన్ 2014లో సమర్పించిన నివేదిక ప్రకారం, ‘‘పెద్ద మొత్తంలో భూములు కలిగివున్నప్పటికీ, వ్యవసాయంపై ఆదాయపు పన్నుకు మినహాయింపు కొనసాగుతోంది. పట్టణాల్లోనే నెలసరి వేతనాలు పొందే ఉద్యోగులకంటే అధికమొత్తంలో ఆదాయం కలిగిన పెద్ద సంఖ్యలో ధనిక రైతులు కేవలం వ్యవసాయంపై పన్ను విధింపు లేని కారణంగా, పన్ను చెల్లింపునుంచి మినహాయింపు పొందుతున్నారు. ఇందుకు ముఖ్యకారణం, వ్యవసాయంపై పన్ను విధించాలన్న ధ్యాస ప్రభుత్వానికి లేకపోవడమే.’’ ఇంకా ఆ నివేదికలో ఏమని పేర్కొన్నదంటే..‘‘వ్యవసాయ రంగానికి సంబంధం లేనివారు, ఇతర మార్గాల ద్వారా తాము సంపాదించిన మొత్తానికి పన్ను ఎగవేయడానికి వ్యవసాయాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. ఫలితంగా ఆదాయపరంగా ఏటా ప్రభుత్వం కోట్లాది రూపాయలు నష్టపోతున్నది.’’
పెద్ద సంఖ్యలో వ్యవసాయ దారులపై కూడా పన్ను విధిస్తే పన్ను చెల్లింపు దార్ల విస్తృతి ప్రస్తుతమున్న 5.5 శాతం లేదా 39 మిలియన్ల పన్ను చెల్లింపు దార్లనుంచి బాగా పెరుగుతుంది. సింగపూర్‌లో పన్ను చెల్లింపుదార్లు 39 శాతం కాగా, అమెరికాలో 46 శాతం, న్యూజిలాండ్‌లో 75 శాతంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదార్ల విస్తృతిని మరింత పెంచుకుంటూ వెళ్లాల్సింది పోయి, 5.5 శాతం పన్ను చెల్లింపుదార్ల నుంచే మరిన్ని పన్నులు వసూలు చేస్తుండడం వల్లనే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. నిజంగా ఇది ‘‘పన్ను ఉగ్రవాదం’’ తప్ప మరోటి కాదు. ప్రభుత్వ వ్యవహారశైలి వల్ల నిజాయతీగా పన్ను చెల్లించేవారు మరిన్ని ఇబ్బందులకు గురికావడం, పన్ను ఎగవేత దార్లు ప్రభుత్వాన్ని మోసం చేయడానికి కొత్త మార్గాలను వెతుక్కోవడం పరిపాటైంది. దేశంలో కొనసాగుతున్న ఈ అవినీతి ఆదాయంపన్ను శాఖకు తెలుసు. 2012, మే నెలలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నల్లధనంపై ఒక శే్వతపత్రాన్ని విడుదల చేసింది. అందులో ఈవిధంగా కుండబద్దలు కొట్టింది.‘‘ఆదాయపు పన్ను చెల్లింపు వ్యవహారాల్లో, వ్యవసాయ ఆదాయమని చూపుతున్న లెక్కలపై ఏవిధమైన పరిశీలన లేకపోవడం వల్ల నల్లధనం వ్యవసాయ ఆదాయం రూపంలో తెల్ల ధనంగా మారి దేశ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశిస్తోంది.’’ ఈ పరిస్థితిలో నల్లధనాన్ని వెలికితీసేందుకు ఆదాయపు పన్ను శాఖ ఏం చేస్తున్నదనే ప్రశ్న ఉదయించడం సహజం.
అందువల్ల నిజాయతీగా విచారణ జరిపితే..వ్యవసాయదారులమంటూ ప్రకటించుకుంటున్న పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, ఉద్యోగుల గుట్టు రట్టయితీరుతుంది. మరి ఇటువంటి ‘రైతులు’ తమ గ్రామాల్లో ఉన్న పూర్వీకుల ఆస్తులను చూపడమో, లేదా కొంత మేర వ్యవసాయ భూమి కొనుగోలు చేసి తాము వ్యవసాయం చేసినట్లు, ఉత్పత్తులను వ్యాపారులకు అమ్మినట్లు నకిలీ రసీదులను సృష్టించడమో చేస్తుంటారు. దీనివల్ల ఏం జరుగుతున్నదంటే, ధనవంతులు ఎంత ఖర్చుపెట్టయినా వ్యవసాయ భూములను కొనుగోలు చేయడం వల్ల, వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా నిజమైన రైతులు భూములను కొనుగోలు చేయాలనుకున్నా, వాటి ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. దీనివల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. పన్ను ఎగవేయడానికి కొం దరు ఘరానా పెద్దలు ఎంచుకున్న ‘వ్యవసాయ’ మార్గం వల్ల అనేక రకాలుగా నష్టం వాటిల్లుతోంది. వారు కొనుగోలు చేసిన భూములు నిరుపయోగంగా పడివుంటున్నాయి. ఎందుకంటే వారు భూములను కొనుగోలు చేసింది కేవలం పన్ను మినహాయింపు పొందడానికి తద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడటానికి! ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలకు చెందిన ఇటువంటి ఘరానా ‘వ్యవసాయదార్లు’ 2013-14లో పొందిన పన్ను మినహాయింపు రూ.10,000 కోట్లు మాత్రమే! ఈ మహానగరాల్లో, వ్యవసాయ భూమి అందుబాటులో ఉంటుందనడం కంటే వైపరీత్యం ఇంకేముంటుంది?
వివిధ రాష్ట్రాల్లో భూ పరిమితి చట్టాలను అమల్లోకి తెచ్చిన తర్వాత భూకమతాల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. అందువల్ల తమకున్న స్వల్ప విస్తీర్ణ భూమి నుంచి సాధారణ రైతులు కోట్ల రూపాయాల ఆదాయాన్ని పొందడం దుస్సాధ్యం. అందువల్ల వ్యవసాయాన్ని రక్షించాలంటే వ్యవసాయదారులను కాపాడాలి. ఈ నేపథ్యంలో నిజమైన రైతులను, నకిలీ రైతులనుంచి విడగొట్టాలి. అన్నదాతల పేర్న పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఇంత పెద్ద మొత్తంలో మోసం, దగా ఆదాయపుపన్ను అధికార్ల ఉపేక్ష వల్ల మాత్రమే సాధ్యమని ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. తమ ఆస్తులు, ఆదాయాన్ని తప్పుగా చూపించే వారిని శిక్షించాలని 1961 ఆదాయపు పన్ను చట్టంలో స్పష్టంగా పేర్కొనివుంది. వ్యవసాయం తప్ప మరే ఇతర ఆదాయ మార్గం లేనివారు తమ ఆదాయం వివరాలను దాఖలు చేయనవసరం లేదన్న అం శాన్ని స్పష్టంగా పేర్కొనవచ్చు. ఎవరికైతే వ్యవసాయంతో పాటు, ఇతర మార్గాల్లో కూడా ఆదాయం ఉంటుందో అటువంటి వారు తమ ఆదాయం వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆదాయం వివరాలు పొందు పరచినవారు పేర్కొన్న వాటిల్లో నిజానిజాలెంతో ఆదాయపుపన్ను శాఖకు చెందిన అధికార్లు ఎందుకని విచారణ జరపరో అర్థం కాదు. ఎంత తెలివితక్కువవాడైనా అవతల వాడు చెప్పేదాంట్లో నిజమెంతుందో తెలుసుకోవడానికి యత్నిస్తాడు కదా! మరి ఆయదాయపు పన్ను అధికార్లు, పన్ను చెల్లింపుదార్లు దాఖలు చేసిన ఫైళ్లను యథాతథంగా ఎట్లా అనుమతిస్తారు? నిజంగా నిరుపేద రైతులను కాపాడాలంటే, ఇటువంటి మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిందే.
పన్ను ఎగవేతకు మాత్రమే కాదు, ఫోర్జరీ, మోసం వంటి వాటికి కూడా చట్టంలో ప్రత్యేక శిక్షలున్నాయి. అందువల్ల సంబంధిత అధికార్లపై ‘సూ మోటో’ కింద కేసును, ఐ.టి. శాఖ విజిలెన్స్ విచారణ చేపట్టవచ్చు. మినహాయింపులు కోరిన మొత్తాలపై ప న్ను వసూలు చేసే కొనే్నళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించడానికీ దారితీయవచ్చు.

- సుధాంశు రంజన్