క్రీడాభూమి

ధోనీని మరిచాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ అందరినీ పేరుపేరునా తలచుకున్న వీరేందర్ సెవాగ్‌కు మహేంద్ర సింగ్ ధోనీ పేరు గుర్తుకు రాలేదా? అతనిని మరచిపోయాడా లేక ఉద్దేశ పూర్వకంగానే అతని పేరును ప్రస్తావించలేదా? తాను క్రికెటర్‌గా కొనసాగిన రోజుల్లో కెప్టెన్లుగా వ్యవహరించిన సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనీల్ కుంబ్లే, సచిన్ తెండూల్కర్‌ను అతను గుర్తుచేసుకున్నాడు. బిసిసిఐ, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ అసోసియేషన్ (డిడిసిఎ) అధికారుల పేర్లను ప్రస్తావించాడు. తన తొలి కోచ్ ఎఎన్ శర్మ, ఢిల్లీ అండర్-19 జట్టుకు తనను తొలిసారి ఎంపిక చేసిన సతీష్ శర్మకు వీరూ కృతజ్ఞతలు తెలిపాడు. తాను క్రికెటర్‌గా నిలబడడంలో ఎఎన్ శర్మ పాత్ర కీలకమని అన్నాడు. 14 ఏల్ల కెరీర్‌లో తాను కలిసి ఆడిన ఎంతో మంది సహచరులను గుర్తు చేసుకున్నాడు. కానీ, ధోనీ పేరును మాత్రం అతను ఎక్కడా ప్రస్తావించలేదు. ధోనీతో కలిసి ఆడిన రోజులనుగానీ, అతని కెప్టెన్సీనిగానీ గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ధోనీ కారణంగానే జాతీయ జట్టులో వీరూ స్థానం కోల్పోయాడన్న అభిప్రాయం ఇప్పటికీ చాలామందిలో ఉంది. ధోనీ పేరును వీరూ ప్రస్తావించకపోవడం ఆ అనుమానాన్ని నిజం వేస్తున్నది. నిజానిజాలు వీరూకే తెలియాలి.