జాతీయ వార్తలు

విద్యార్థి హత్యకేసులో 8 మందికి మరణశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లో సౌరవ్ చౌహాన్ అనే విద్యార్థిని దారుణంగా నరికిచంపినందుకు 8 మంది నిందితులకు బరాసత్‌లోని జిల్లా కోర్టు మరణశిక్షను విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 24 పరగణాల జిల్లాకు చెందిన సౌరవ్ తాను చదువుతున్న కళాశాల పరిసరాల్లో మద్యం, మత్తుపదార్థాలు అమ్ముతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొంతమంది చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలపై ధైర్యంగా ఉద్యమించాడు. దీంతో 2014 జూలై 5న రాత్రి సమయంలో సౌరవ్‌ను ఓ ముఠా సభ్యులు సౌరవ్‌ను ఇంటి నుంచి రోడ్డుమీదకు బలవంతంగా ఈడ్చుకుని వచ్చి దారుణంగా నరికి చంపారు. శరీరాన్ని ముక్కలుగా నరికి రైల్వేట్రాక్‌పై పడేశారు. ఈ కేసులో మొత్తం 13 మందిపై అభియోగాలు దాఖలు కాగా 8 మందికి ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదు, ముగ్గురికి ఐదేళ్ల చొప్పున కారాగార శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఓ నిందితుడిని నిర్దోషిగా వదిలేశారు.