జాతీయ వార్తలు
దావూద్ మేనల్లుడి పెళ్లిపై పోలీసుల డేగకన్ను!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 August 2016
ముంబయి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడి పెళ్లి సందర్భంగా పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. దావూద్ మేనల్లుడు అలీషా పార్కర్ వివాహం నగరంలోని నాగ్‌పడా ప్రాంతంలోని మసీదు వద్ద బుధవారం ఉదయం 11 గంటలకు జరిగింది. పెళ్లి వేడుకలను దావూద్ ‘స్కైప్’లో వీక్షిస్తాడన్న ప్రచారం కొద్ది రోజులుగా ఊపందుకుంది. ఈ రోజు సాయంత్రం ఓ హోటల్లో పెళ్లి రిసెప్షన్ సందర్భంగా దావూద్ తన బంధువులతో వీడియో కాల్ మాట్లాడతాడని కూడా వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు పెళ్లి విందుపై కూడా నిఘా పెట్టారు. దావూద్ గురించి ఏదో ఒక సమాచారం లభిస్తుందని పోలీసులు వివిధ రూపాల్లో నిఘా పెట్టారు.