డైలీ సీరియల్

విలువల లోగిలి-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎవరో పోయాడు’’ అన్నాడు అటు చూస్తూ.
మళ్ళీ మామూలుగానే డ్రైవ్ చేస్తున్నా పదే పదే పరిసరాలను ఎందుకు గమనిస్తున్నట్లు అని ఆలోచిస్తూ అతని ఆలోచనలకు బ్రేక్ వేయాలనుకున్నాను.
‘‘మా అమ్మ అవసరంలో కూడా ఎవరినీ లిఫ్ట్ అడగకు, వెళ్లకు అంటుంది. పబ్లిక్ ప్లేస్‌లో భయం ఏమిటి అంటాను నేను. ఇపుడు మనం వెళుతున్నాం. ఒక్కసారి అరిస్తే అందరూ గుమిగూడుతారు. మీరు మంచివాళ్ళయినా ఆడవాళ్ల మాటలకే అలాంటి సమయంలో విలువ ఉంటుంది. భయం ఎందుకు అంటాను. అయినా ఆవిడ ఒప్పుకోదు’’
తన మాట పూర్తి అవలేదు, కాస్త ముందుకు జరిగాడు.
‘‘ఆడవారా! మజాకానా!’’ మనసులోనే అభినందించుకున్నాను.
ఇంతకూ మీ పేరు చెప్పారు కాదు.
‘‘లక్ష్మణరావు’’
అలనాటి సీతమ్మను తీసుకువచ్చిన లక్ష్మణుడిలా ప్రవర్తించి ఉంటే ఇంకా బాగుండేదని మనసులో అనుకున్నా.
విలువలు లేని మనుషులు. అవసరానికి ఓ ఆడపిల్ల సహాయం అడిగితే దానిని కూడా ఉపయోగించుకోవాలని చూసే అధములు. ఈ బయటి ప్రపంచంలో బ్రతకాలంటే ప్రతి నిమిషం పులి మేక ఆట ఆడుతున్నట్లే ఉంటుంది.
అర్థరాత్రి ఆడవారు స్వేచ్ఛగా నడవాలన్న పూజ్య బాపూజీ పైకి వెళ్లిపోయి హాయిగా ఉన్నారు. తామే! పట్టపగలే ఏం జరుగుతుందో అని ప్రతి నిమిషం అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది. ఎంత అభద్రత? ఏమిటో ఈ మనుషుల నైజాలు?’’
‘‘మీరు ఎక్కడ దిగుతారు?’’
గురుడులో భయం ప్రవేశించినట్లుంది.
హూండై షోరూమ్ దగ్గర ఆపితే దిగిపోతాను.
పది నిముషాలలో అక్కడ దింపేసాడు.
‘‘మీ సెల్ నెంబరు ఇవ్వండి. సహాయం చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకోవటం నాకు అలవాటు’’ అంది విశ్వ.
‘‘వద్దులేండి’’ అంటూనే వెళ్లిపోయాడు.
మంచో, చెడో ముందు తనని ఇంటర్వ్యూ సమయానికి దించేసి వెళ్లాడు. కానీ ఈ దెబ్బతో తనకి తెలిసి వచ్చింది. జీవితంలో తెలియనివారి దగ్గర లిఫ్ట్ తీసుకోరాదని. ఈ రోజు తను నేర్చుకున్న పాఠం ఇదే.
హడావుడిగా లోపలికి వెళ్లింది.
పైన హాలు ఉంది. అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడ వందమందికి పైగా ఉన్నారు.
ఇక ఉద్యోగం వచ్చినట్లే. ఉన్నది ఆరు పోస్టులు. దేశంలో వున్న నిరుద్యోగం అంతా ఇక్కడే ప్రత్యక్షమైనట్లుంది.
బ్యాంకు జాబ్‌లకు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్లు వస్తున్నారు అని చెబుతుంటే విస్తుపోయింది. ఇపుడు ఎదురుగా కనిపిస్తోంది. ఉండాల్సింది డిగ్రీ క్వాలిఫికేషన్. ఇక్కడ యంబిఏ చదివిన వాళ్ళు కూడా వచ్చేసారు. చిన్న క్లర్క్ పోస్టుకి ఇంత డిమాండా? నిరుద్యోగుల సంఖ్య ఇంత ఎక్కువగా వుందా దేశంలో?
మూడు గంటలకు ఇంటర్వ్యూ పూర్తయింది.
ఫలితాలు తర్వాత తెలియజేస్తామని చెప్పటంతో అప్పటిదాకా వున్న టెన్షన్ పోయింది. మనసు గాలిలో పక్షిలా ఎగరసాగింది. తనవరకు తను వాళ్ళు అడిగినవాటికి సంతృప్తిగా సమాధానమిచ్చింది. వస్తే సంతోషం. ఖాళీగా కూర్చోలేక ఇక్కడకు వచ్చింది. అదే ఈ ఉద్యోగం తమ ఊర్లో దొరికితే ఇంకా బాగుంటుంది.
‘‘మీ ఇంట్లోనే అయితే ఇంకా ఇంకా బాగుంటుందేమో’’ అంతరాత్మ నేను ప్రక్కనే ఉన్నానంటూ ఎత్తిపొడిచింది.
‘‘తల్లీ! నన్ను వదిలి పొమ్మన్నా పోవుగా. నినె్నట్లా మరిచిపోతాను?’’ అనుకుంది మనసులో. షేర్ ఆటో ఎక్కి రామవరప్పాడు స్టేషన్ వంతెన ముందు దిగింది. వంతెన దాటి క్రిందకు దిగేటప్పటికి తల ప్రాణం తోకకి వచ్చింది. వెళ్ళే మనుషులు, వచ్చే మనుషులు, వీళ్ళకు తోడు సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు. ఇదంతా ప్రక్కకు పెడితే పారే కాలువ కళ్ళకు మంచి ఉల్లాసం. అలా ప్రవహించే నీటిని చూడటం తనకెంతో ఇష్టం. ఆ నీటిపైన చెత్త కూడా తనకు అందంగానే కనిపిస్తుంది. అక్కడ బంకులను, ఇళ్ళలో ఉన్నవారిని, బయట ఆడుకునే పిల్లలను అందరినీ గమనిస్తూ స్టేషన్ వరకు వెళ్లింది.
రైలు వస్తోందేమో అని అటువైపు ఇటువైపు చూసి పట్టాలు దాటింది. ఇలా అందరూ చేస్తే పొరపాటున ఎలా చచ్చిపోతారు అని తనను తానే ప్రశ్నించుకుంది.
స్టేషన్‌లో కౌంటరు దగ్గరకు వెళ్లి టిక్కెట్టు తీసుకుని వచ్చి అక్కడ చెట్టు నీడన వున్న బల్లమీద కూర్చుంది, ప్రక్కవాళ్ళ బ్యాగు వుంటే తియ్యమని చెప్పి.
చల్లగా ప్రశాంతంగా వున్న వాతావరణం. ఎందుకో ఆ స్టేషన్ తనకు చాలా బాగుంటుందనిపించింది. అలా మనసులో ముద్రపడిపోయింది. రైలు వచ్చేంతవరకూ దీన్ని ఆస్వాదించవచ్చు అనుకుని ఆపనిలో పడిపోయింది.
పెరుగన్నంలో పచ్చడి అద్దుకున్నట్లు ఆ ప్రకృతితో పాటూ అక్కడ రైలు ఎక్కటానికి వచ్చినవారి మాటలును ఆలకిస్తోంది ఆమె.
నాలుగు గంటలకు రావలసిన రైలు అరగంటయినా రాలేదు. గంటయినా రాలేదు. దారిలో పట్టాలు మీద ఎవరో ఆత్మహత్య చేసుకోవటమే దానికి కారణమని మాత్రం చెప్పుకుంటున్నారు. ఆ ఫార్మాలిటీస్ పూర్తిచెయ్యటమే ఈ ఆలస్యానికి కారణం అని స్టేషన్ మాస్టరు చెబుతూ ఉండటంతో అందరూ స్టేషన్‌లోనే రాబోయే రైలుకోసం పడిగాపులు కాస్తున్నారు. విసుగును తోడుగా తీసుకుని చికాకుపడుతూ మరికొందరు అటూ ఇటూ తిరుగుతున్నారు. అసహనం ఒక్కొక్కరినీ ఆవహిస్తోంది. కొందరు ప్రయాణాన్ని ఆపుకుని వెళ్లిపోయారు.
ఎంతసేపయినా తను మాత్రం ఆ రైలులోనే వెళ్లాలి. ఈ ఊరి వాళ్ళయితే ఈ రోజు కాకపోతే రేపు వెళ్తారు అనుకొంది విశ్వ మనసులోనే.
ఒక గంట తర్వాత కొత్త పెళ్లికూతురిలా నెమ్మదిగా వచ్చి ఆగింది. రైలంతా జనంతో కిక్కిరిపోయి ఉంది. ఎక్కటం కూడా కష్టమనిపించేట్లున్న ఆ రైలుకి అతికష్టంమీద ఎక్క గలిగింది. దిగే వాళ్ళను దిగనివ్వరు. ట్రైను ఎక్కడవెళ్ళిపోతుందో అని ఎక్కే వాళ్ళకూ భయమే. ఎవ్వరూ రాజీపడరు. ఆ తోపులాటలో ఒక్కోసారి ప్రాణాలుపోయినా పోవచ్చు. అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడూ అదే జరిగింది. చేతిలో ఫైలుతో వెనక్కి పడిపోతానేమో అనిపించింది. ఒకవేళ అలా పడిపోతే, సర్ట్ఫికేట్స్ క్రింద, తాను లోపల ఉంటే ఏమవుతుందో అని ఒక్కసారి ఊహిస్తేనే ఒళ్ళు జలదరించింది. ఆ తోపులాటలో నిలదొక్కుకోలేనేమో అని కూడా అనిపించింది. అలాగే ఎలాగో లోపలికి రాగలిగింది. ఇలాంటప్పుడే ‘క్యూ’ పద్ధతి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. టిక్కెట్లు అమ్మేచోట ఉంటారు కానీ ఇలా ప్రతి పెట్టె దగ్గిర ఎవరో ఒకరు ఉండి ఇలాంటి విషయాలు చూడరుగా.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206