డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--85

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన రుూ పతనానికి తానే బాధ్యుడైనప్పటికీ, తననీ కూపంలోకి పడేసిన ఆ నీచురాలి బాధ్యత కూడా లేకపోలేదు!
తనమీద తనకు కలిగిన అసహ్యాన్ని భరించలేకపోయాడతను. దాన్ని క్లియోపాత్రా పరంగా విడుదల చేయందే మనశ్శాంతి ఉండదు. అందువల్ల ప్రయోజనమనేది రుూ స్థితిలో ఉండనప్పటికీ, కనీసం కడుపుమంటన్నా చల్లరుతుందనే భావంతో అతను మండిపడుతూ, క్లియోపాత్రా పట్టు డేరా వైపు పరుగెత్తాడు.
క్లియోపాత్రా ఆభరణాలనూ, వజ్ర వైడూర్యాలనూ తిలకిస్తూ, ఒక్కో ఆభరణం తన శరీరంమీద ఎలా సొంపుగా అమరుతోందో పరీక్షిస్తూన్నది. పక్కన బానిస స్ర్తిలు ఆమె కనుసన్నలకు వేచి ఉన్నారు. ఏంటనీ చెప్పకుండా చేయకుండా హడావిడిగా, బరువైన అడుగులు వేసుకుంటూ, ఎక్కుపెట్టిన విల్లును బాణంవలె వచ్చిపడ్డాడు. క్లియోపాత్రా ఏదో ప్రమాదం వాటిల్లి వుంటుందని అనుకున్నది. బానిస స్ర్తిల వైపు కనుబొమ్మలు ముడిపడేట్లు క్లియోపాత్రా చూడగానే వారు నిష్క్రమించారు.
ఏంటనీ నిప్పులు కక్కుతున్నాడు. కంఠస్వరం కఠోరంగా వున్నది.
‘‘చూడు! రాణీ- ఏమైనదో!’’ అన్నాడు రెండు చేతులు పైకెత్తి.
ఆమెకేమీ అర్థం కాలేదు. డేరా పైభాగంవైపు ఒకసారి చూసి ‘‘ఏమైందీ?’’ అన్నది.
‘‘సర్వనాశనమైంది! మన నౌకాదళ సర్వసేనాని వెళ్లి, ఆక్టోవియన్‌తో కలిశాడు. అనుమానితులుగా వున్న ఇద్దరు ముగ్గురు సేనానుల్ని నరికివేశాను!’’ అన్నాడు ఏంటనీ- ఆ ఘోర దృశ్యమంతా తన ముఖంలో ప్రతిఫలించేట్లుగా.
‘‘మంచిపని చేశావు!’’ అన్నదామె. ఇదొక పెద్ద సమస్యా అనే ధోరణిని కనబరుస్తూ.
‘‘మంచిపనా! రాణీ! ఆ మాట ఎలా అంటున్నావు? ఇంతకన్నా ఘోరాన్ని నేను ఊహించలేను. అలాంటిది నేను చేసింది మంచిపని అంటున్నావా?’’
‘‘కాక?..’’ అన్నదామె కళ్ళు తమాషాగా తిప్పుతూ. ‘విశ్వాసఘాతకులకు తగిన శిక్షన విధించినందుకు..’’
‘‘పారిపోయినవాణ్ణి కాదు నేను శిక్షించింది! నేరం రుజూకాని అమాయకుల్ని వధించాను!’’ అని ఏంటనీ తెలియజెప్పేందుకు ప్రయత్నించాడు.
‘‘అది కూడా సత్కార్యమే కాగలదు! ఎందుకంటే, ఇప్పుడే సేనానుల తలల్ని చూచిన తరువాత, మిగతావాళ్ళన్నా వొళ్ళు దగ్గరుంచుకుంటారు. కనీసం భయపడి, విశ్వాసఘాతుకానికి వొడిగట్టరు కదా!’’ అన్నది క్లియోపాత్రా.
ఈ వెధవ పని చేసినందుకు క్లియోపాత్రా తనను దూషించినట్లయితే, ఏంటనీ కొంతవరకూ తృప్తిపడేవాడు. కనీసం పొరపాటు జరిగిపోయినందుక్కూడా ఆమె విచారించటంలేదు సరికదా, తనను సమర్థిస్తోంది. ఈ విధంగానే ఆమె తన వాక్చాతుర్యంతో అనేక విషయాల నిజ స్వరూపాల్ని, తనకు అనుకూలమైన విధంగా చిత్రించి పెడతోవల్లో నడిపించింది.
ఈ సమయంలో మాత్రం తనను ఆమె అగాథాల్లోకి తోసేస్తోందనే విషయాన్ని ఏంటనీ గ్రహించగలుగుతున్నాడు. ఆమెను మాట్లాడనివ్వటమంటే, తనను తనా పతనం చేసుకోవటమే కాగలదు. అందుకని చాలా ఉద్రేకంతో, ఆమె మాటల్ని ఖండిస్తూ నోరు మూయించాలన్నంత కోపంతో అతను మాట్లాడసాగాడు.
‘‘ఇలాగే నన్ను సమర్థిస్తూ, నేనెంతో గొప్పవాణ్ణనే ధోరణిలో నమ్మిస్తూ వచ్చావు కాని, ఈనాడు నేను నిజం తెలుసుకోగలుగుతున్నాను రాణీ! నీవు మంత్రగత్తెవు. సౌందర్యానికి తోడుగా, తెలివితేటలుంటే ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తవో అనుభవపూర్వకంగా తెలిసొస్తోంది. ఇంత ఘోరాన్ని కూడా ఎంత తేలిగ్గా అంచనా వేశావు! పట్టు డేరాలో సౌందర్యారాధనలో నిమగ్నవైన నీకు, నేనెంత పతనమైపొయ్యానో అర్థం కాలేదా? నేను చంపించిందెవరిని? ఉత్తమవంశజులు, నమ్మినబంట్ల వంటి నా సోదరతుల్యుల్ని. రుూ వెధవ అధికారమదంతో కళ్ళు గానక వధించాను! ఆ అధికారమే వారి చేతుల్లో ఉన్నట్లయితే’’
మాటకు అడ్డుపడి క్లియోపాత్రా అన్నది: ‘‘అప్పుడు నీకీ శ్రమ ఉండేది కాదు. బహుశా నినే్న వారు వధించి ఉండేవారు!’’
ఏంటనీకి నవ్వు రాలేదు సరికదా, అగ్గిమీద గుగ్గిలం పడినట్లయింది.
‘‘అలా జరిగినా బాగుండేది! కనీసం నా పాపాలకు పరిహారంగా ప్రాణాల్ని ఇచ్చుకున్నాననే తృప్తన్నా ఉండేది!’’ అన్నాడతను.
‘‘బతికిపోయినందుకు బాధపడుతున్నావా ఏంటనీ! కాస్త స్థిమితంగా ఆలోచిస్తేనే కాని, నా అభిప్రాయం నీకు అర్థం కాదు.. కాస్త మధువు తెప్పించనా?’’ అన్నది క్లియోపాత్రా.
‘‘మధువు!’’ అని వికటంగా నవ్వాడు ఏంటనీ. ‘‘మధువుతోనూ, మమతతోనే నన్ను జయించావు. తేనెపూసిన కత్తివలె ఉన్న నీ మాటలకు మోసపొయ్యాను; పయోముఖ విషకుంభానివి నీవు! నీ సౌందర్యానికి దాసానుదాసుడై రుూనాడీ మట్టిలో పడి కొట్టుకునే దుర్గతికి దిగజారాను.. నీ వల్లనే కదా ఆక్టోవియాకు విడాకులిచ్చింది? నీ మూలానే కదా మాతృదేశానికి దూరమై, బద్ధ విరోధినైనది? నీ గూర్చే కదా, చేయరాని పనులన్నీ చేస్తున్నది? నీవు నైల్ సర్పానివి రాణీ! ప్రపంచ చరిత్రనే నీ వైపు లాక్కునేందుకుగాను నన్ను ఆహుతి చేస్తున్నావ్?’’ అన్నాడు.
ఏంటనీ ఇంత తీక్షణంగా మాట్లాడుతాడని ఆమె అనుకోలేదు. తీరా తన చెవులను తాను నమ్మక తప్పనప్పుడు, ఆమె కోపం కూడా మిన్నుముట్టింది.
‘‘ఏమన్నావ్ ఏంటనీ? నావల్లనే ఇదంతా జరిగిందా!’’ అని ఆమె నీలదీసి అడిగింది.
‘‘ఔను.. నన్ను పరమ మూర్ఖుడిగా తయారుచేసిందెవరు?’’
‘‘మూర్ఖుడు! తాను మూర్ఖుడని తెలుసుకోగలిగిన మూర్ఖుడు! మూర్ఖులు వారి బలహీనతలకు జరిమానాలు చెల్లించుకుంటారుగాక!’’ అని ఆమె పకపకా నవ్వింది.
ఏంటనీ మరింత రెచ్చిపోయాడు.
‘‘ఏనాడు నీ ప్రణయపాశంలో చిక్కుకున్నానో, ఆనాడే నేను మానవత్వాన్ని కోల్పోయి, దానవుణ్ణయ్యను. దేవతా రూపంలో నా జీవితంలో ప్రవేశించి దెయ్యంగా పరిణమించావు నీవు! నీ స్వార్థం కోసం, నీ సుఖాలకోసం, నీ దురాశల కోసం నన్నొక పనిముట్టుగా ఉపయోగించుకోగలిగావు...’’
తీరా కళ్లెదుట సేనానుల తలలు వేళ్ళాదీయబడి, మొండాలనుంచి రక్తం చిమ్ముతుంటే, ఏంటనీకి కళ్ళు తిరిగినవి. తాను ఎంతో ఘోరాతి ఘోరానికి తలపడ్డాడో అతను గ్రహించగలిగాడు. ఇక చూడలేక, కళ్ళు రెండూ మూసుకొని, అందర్నీ వెళ్లిపొమ్మని ఆజ్ఞాపించి, ఒక్కడూ చాలాసేపు దుఃఖపడ్డాడు.
కొంచెంసేపయాక తన దుర్గతిని గుర్తించాడు. జన్మలో తాను చేయలేని నీచాతి నీజమైన పనిచేశాడు. ఆలోచిస్తే- ఇదేకాదు- ఇలాంటివి ఇంకెన్నో చేసినట్లు తెలిసివస్తోంది. తానీ ప్రపంచంలో ఎవరి మాటా లెక్కచేయని మొండివాడుగా తయారయ్యాడు. ఒక్క క్లియోపాత్రాయే తనకు ప్రేయసి, భార్య, గురువు, దైవంగా ఉన్నది. ఆమె ముందు రుూ ప్రపంచంలోనివన్నీకూడా అత్యల్పాలుగానే తనకు కనిపించినవి. ప్రేమపిచ్చిలో పడిపోయి, నిజంగా పిచ్చివాడయ్యాడు.
- ఇంకాఉంది-

ధనికొండ హనుమంతరావు