డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--81

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలు ఆశ్చర్యంతో ముక్కుమీద వేలేసుకున్నారు. ఏంటనీ బహిరంగంగా ఆక్టోవియాకు విడాకులివ్వటాన్ని ఎవ్వరూ సహించలేకపొయ్యారు. ఇదొక నైతిక పతనంగా అందరూ గుర్తించారు.
ఆక్టోవియన్ వీలునామాను సంగ్రహించటం నీచమైన పనే! ఐతే, అందులోని రహస్యాన్ని బైట పెట్టాక, అతి నీచమైన ఏంటనీ వాంఛల ముందు, ఆక్టోవియన్ నైచ్యం ఒక లెక్కలోకి రాలేదు. ఈ విధంగా అతను బైటపడ్డాడు.
మళ్లీ సర్వాధికార వర్గ సమావేశంలో ఆక్టోవియన్ హుంకరించాడు;
‘‘ఇంతకన్నా రుజూలు ఏం కావాలి? ఏంటనీ రోమన్ అని ఎవరనగలరు? అతని భార్య ఆక్టోవియా! ఆమె అతనికి సంతానాన్ని కన్నది. మహాసాధ్వి. ఆమెనీనాడు కారణాలంటూ లేకుండానే ఏంటనీ విడిచిపెట్టాడు. మహాపురుషులే రుూ విధంగా ప్రవర్తిస్తుంటే, నైతిక పతనమనేది ఎక్కడ మొదలై, ఎంత త్వరగా భూమట్టానికి రాగలదో నేను నేరుగా వివరించనవసరంలేదు.
సీజర్ సంతానం- సీజర్ టాలమీగా తాను గుర్తిస్తున్నానని ఏంటనీ వీలునామాలో ఉదహరిస్తున్నాడు. సీజర్ మరణానంతరం, ఆ మహనీయుని వీలునామాను మీరందరూ విన్నారు. సీజర్ టాలమీని తన కుమారుడుగా ఆయనెక్కడా ఉదహరించలేదు. క్లియోపాత్రా వ్యక్తిగత జీవితంలో ఆమెకు ఎంతమంది ప్రియులున్నారో, ఆమె ఎవరెవరికి ఏయే సంతానాన్ని కన్నదో మనకు అప్రస్తుతం. కాని, సీజరే అంగీకరించలేని తన సంతానాన్ని, ఏంటనీ అంగీకరించటంలో అర్థమేమిటి? అది సీజర్ మరణానంతరం ఏనిమిదేళ్ళ తరువాత? దీని ఆంతర్యం ఏమిటో మీరు కొంచెం ఆలోచించండి!
‘‘ఈనాడు ఏంటనీకి ఈజిప్టు స్వదేశం. రోమ్ పరదేశమూను. క్లియోపాత్రా ప్రేమపాశంలో అతనికి వొళ్ళుతెలియటంలేదు. క్లియోపాత్రాను సంతోషపెట్టేందుకు అతను ఎంతో ఘోరాన్నయినా చేసేందుకు సిద్ధపడుతున్నాడు. ఆమెను ఆనందపరచేందుకే కదా- ఆక్టోవియాను విడిచేసింది? ఆమె సంతనాన్ని ఎలాగైనా రోమ్‌లో పరిపాలకులుగా చేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఈజిప్షియన్‌ను తమ పాలకుడుగా ఒప్పుకునేందుకు రోమన్‌ల రక్తం ఇంకా చల్లబడలేదు. రోమన్ సామ్రాజ్యంలోని ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి, తిరిగి సింహాసనాన్ని సృష్టించి, దానిమీద తానూ, తన ప్రియురాలు క్లియోపాత్రా, ఆమె సంతానమూ సుఖంగా అధిష్ఠించాలని ఏంటనీ ఆశయం. దీన్నిగూర్చి ఇంకా వివరంగా చెప్పవలసిన పనిలేదు. అతను స్వహస్తాలతో రాసిన వీలునామాయే ప్రబల నిదర్శనం.
‘‘మరణానంతరం అతని దహనక్రియ ఇక్కడ జరగాలట! అంతవరకూ బాగానే వున్నది. కాని, అతని అస్థికల్ని ఈజిప్టు తీసుకెళ్లి, క్లియోపాత్రా సమాధి పక్కనుంచాలట! బతికి ఉన్నప్పుడేగాక, చచ్చాక కూడా క్లియోపాత్రా పొందునే కోరుతున్నాడతను! జంతువుల్ని పూజించే జాతిది క్లియోపాత్రా! ఆమెకు అతనిచ్చిన గౌరవాన్ని ప్రతి రోమనూ ఇవ్వాలనటం నిరంకుశత్వమూ, నైచ్యమే కాగలవు.
‘‘అయితే, ఇప్పటికీ ఏంటనీని క్షమించగల విశాల హదృయం రోమన్ ప్రభుత్వానికి ఉన్నది. అతను రోమ్‌కు చేసిన మేలును దృష్టిలో ఉంచుకొని, అతని రుూ ద్రోహబుద్ధిని కూడా సహించేందుకు సిద్ధంగా ఉన్నాం. రాజ్యపాలన కలుషితం కాకుండా ఉండేందుకు పాలక వర్గంలోంచి మాత్రమే అతన్ని తొలగిస్తాం. అతను రోమ్‌లో సర్వస్వతంత్రుడుగా ఉండొచ్చు. తన పాప కార్యాలకు పశ్చాత్తాపపడి, క్షమార్పణలను అర్పించి, రోమ్‌కు తిరిగి రావచ్చు. దేశ విద్రోహకర కార్యకలాపాలలో అతను పాల్గొన్న కారణంగా ప్రభుత్వం అతని ఆస్తిపాస్తుల్ని లాక్కున్నది. అతను రోమ్‌కు రోమన్‌గా తిరిగి వచ్చి, రోమన్‌గానే బతుకుతానని హామీ ఇచ్చినట్లయితే, అతని ఆస్తిపాస్తుల్ని తిరిగి ఇచ్చివేస్తాం.
‘‘ఏంటనీకి ఈ దుర్బుద్ధులు ఎలా సంక్రమించినవో మనం తేలిగ్గా ఊహించవచ్చు. దేశభక్తికి మారుపేరుగా ఉండే ఏంటనీ దేశద్రోహిగా మారాడంటే మొదట్లో ఎవ్వరం నమ్మలేకపొయ్యాం. ఇపుడు అతన్ని వేరువిధంగా ఎత్తి చూపగల వాదన మచ్చుకు ఒక్కటి కూడా లేదు.
‘‘ఇదంతా ఆ మాయలాడి, మంత్రగత్తె, నైల్ సర్పం, విషకన్య- క్లియోపాత్రా పథకమే కాని వేరుగాదు. ఆమె పన్నాగాలకు ఏంటనీ లొంగిపొయ్యాడు. ఆమె చల్లిన మత్తు మందుకు ఎరయ్యాడు. ఆమె దురాక్రమణ పన్నాగాలకు వంతపాట పాడుతున్నాడు. ఆమె ఈనాడు రోమ్‌మీద దండయాత్ర సాగించే సాహసానికి ఏంటనీయే కారకుడు. ముఖ్యంగా మనం క్లియోపాత్రానూ, ఆమె రాజ్యాన్నీ వశం చేసుకోనట్లయితే, శాంతి దేవతకు స్థానం ఉండదు. ఇప్పటికే ఓర్పుతో సమయం మించిపోనిచ్చాం.
‘‘గ్రీస్‌లో వున్న సైన్యం రుూ ప్రపంచానే్న జయించగలదనే వార్తలు వస్తూన్నవి. అందులోనూ గ్రీస్ ప్రస్తుతం రోమన్ సామ్రాజ్యంలో భాగం కదా! ఏంటనీ దాన్ని ఆక్రమించుకున్నాడంటే కయ్యానికి కాలు దువ్విన వాడయ్యడు. అంతకన్నా క్లియోపాత్రా రుూ దురాక్రమణ సాగించిందనటం సమంజసం. ఈనాడు ఏంటనీ నిమిత్తమాత్రుడు. క్లియోపాత్రా చేతిలో కీలుబొమ్మ!
‘‘మనం ప్రకటించబోయే యుద్ధం ప్రజాసమరం! ఇదొక అంతర్యుద్ధమని నా మిత్రులు ఆటంకాలు చెపుతూ వస్తున్నారు. ఐతే, మన యుద్ధం ఏంటనీ మీద కాదు, క్లియోపాత్రామీద! అనగా ఇది అంతర్ద్ధుం కానేరదు. మన శత్రుదేశమైన ఈజిప్టుమీద. ఆ దేశం దురాక్రమణలపట్ల జరిపే పవిత్రయుద్ధం.
‘‘ఇందులో అభ్యంతరాలనేవి మరి ఉండేందుకు వీల్లేదు. ఇటలీ అంతా నా వాదనలకు జోహారులర్పిస్తోంది. ఎవరైనా, ఎదురుచెప్పేవారుంటే, వారు ఏంటనీ క్లియోపాత్రాలపక్షానికి చెందిన దేశద్రోహులుగా గుర్తించబడతారు- జాగ్రత్త!’’
ఈ గంభీరోపన్యాంతో ఏంటనీ మిత్రులు పెదవులు కదల్చలేదు. భవిష్యత్ అనేదాన్ని ఎవ్వరూ శాసించే స్థితిలో లేరు. మీదుమిక్కిలి భవిష్యత్తే ప్రపంచాన్ని శాసించగల మహత్తర శక్తిగా రూపొందింది.
క్లియోపాత్రా మీద రోమ్ యుద్ధాన్ని ప్రకటించిందనే వార్త వాయువేగ మనోవేగాల్తో భూగోళమంతటికీ తెలిసిపోయింది. రోమ్ తలుచుకుంటే, తనను ఏనాడైనా నల్లిని నలిపినట్లు నలిచివేస్తుందని క్లియోపాత్రాకు తెలుసు. యుద్ధ ప్రకటన విని, ముందు భయపడిందామె. కాని ఈ యుద్దం తనమీద కాదనీ, ఏంటనీ మీదనేననీ, ఒకవేళ తననే గురిచూసినప్పటికీ ఏంటనీ ముందడుగు వేసి ఎదుర్కోక తప్పదనీ ఆమె తేల్చుకొని ఊరట చెందింది.
ఆ తరువాత జరిగిందంతా విని ఆమె ఆశ్చర్యపడింది.
ముఖ్యంగా , ఒకసారెప్పుడో ఏంటనీ వీలునామాను రాసినట్లు చెప్పాడు. కాని, తాను నమ్మలేదు. ఎందుకంటే, రహస్యంగా వున్న ఆ వీలునామాలో తనకు ప్రతికూలంగా ఏమున్నదో, అనుకూలంగా ఏమున్నదో తెలియదు. ఒకవేళ ఏంటనీ నిజమే చెప్పినప్పటికీ తనకు నమ్మకమేమిటి? అందుకని అప్పుడు లక్ష్యపెట్టలేదు.
ఈనాడు దాన్ని పెళ్లగించి, దాని ప్రతులను ఇటలీ అంతటా ఆక్టోవియన్ పంచిపెట్టాక వీలునామాలోని విషయాలు బహిరంగమైనవి.
తాను ఎంతగా మనసారా ఏంటనీని ప్రేమిస్తూన్నప్పటికీ, ఏంటనీ కూడా హృదయపూర్వకంగా తనను ప్రేమిస్తున్నాడా అనే సందేహం తనకు ఉండేది. రోమన్ ప్రణయాన్ని నమ్మేందుకు వీల్లేదని ఆమె సిద్ధాంతం. మొదటి ప్రియుడు జూలియస్ సీజర్ తనను ఆరో ప్రాణంగా చూసుకుంటూన్నట్లే నటించి, చివరకు వీలునామాలో తన ప్రసక్తే తేలేదు. ఆ అనుభవంతోనే ఆమె రోమన్‌ను నమ్మినట్లు నటిస్తూ, నమ్మకుండానే వున్నది.
కాని ఇప్పుడు ఏంటనీ వీలునామాలోని విషయాలను చూశాక, అతని ప్రణయం తన ప్రేమకన్నా బలవత్తరమైనదని తేలిపోయింది. ఈ అమర ప్రేమలో తన జీవితమే ధన్యమైనదని ఆమె నమ్మింది
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు