డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--77

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన రుూ సుఖ స్వప్నం చెడుతుందేమోననే భయంతో ఏంటనీ ఇదంతా ఏమిటని అడిగిన పాపాన పోలేదు.
అక్కడ రోమ్‌లో ఏం జరుగుతూన్నదో, ఏ రోజు కారోజు క్లియోపాత్రాకు తెలుస్తూనే వున్నది. ఆక్టోవియన్ రోజురోజుకూ బలవంతుడౌతున్నాడు. అతను రెచ్చిపోతున్నాడు. ప్రజలనూ, సర్వాధికార వర్గ సభ్యుల్నీ మభ్యపెడుతున్నాడు. మరి ఈజిప్టులో క్లియోపాత్రా సైన్యాలను సమకూరుస్తున్నదని విన్నాక, అతను మరింత తొందరపడుతున్నాడు.. ఆమెకు కావలసింది ఇలాంటి పరిణామాలే!
తన ఉత్తరాలకు ఆక్టోవియన్ జవాబులు పంపనందుకు ఏంటనీ చాలా బాధపడ్డాడు. తన మీద అతను కారాలూ మిరియాలూ నూరుతూండి ఉంటాడని భావించాడు. ఒక్కోసారి తనకిక రోమ్‌తో ఏం పని అనుకుంటాడు. మరొకసారి ఇక్కడి సంసారానే్న చూసుకుంటున్నాడు కాని, అక్కడ ఆక్టోవియా సంగతీ, ఆమె సంతానం సంగతీ గుర్తొచ్చి వెళ్లిపోదామా అని తలపోస్తాడు. ఎటూ తేలని రుూ సమస్యలతో తల బద్దలు కొట్టుకోవటం దేనికని, అంతా మరిచిపోయేందుకు మధుపానాన్ని సాగిస్తాడు.
రోమ్‌లోని ఏంటనీ మిత్రులు ఒక లేఖ పంపారు.
ప్రియమిత్రమా!
‘‘నిన్ను రోమ్‌లో చూసి మూడేళ్లయింది. ఈ మూడు సంవత్సరాలలోనూ ఇక్కడి ప్రభుత్వానికి కుక్కమూతి పిందెలు కాచినవి. ఇక్కడి వార్తలు దూరాన ఈజిప్టులో వున్న నీకు అందుతూనే వుంటవని అనుకుంటున్నాము. అయినప్పటికీ ఆ వార్తల వెనుక దాగిన ఆశయాలూ, దురుద్దేశాలూ, దుష్టుల మనస్తత్వాలను వివరించటం అవసరమని భావిస్తున్నాము.
‘‘ఆక్టోవియన్ నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాడు. సర్వాధికార వర్గాన్ని కూడా లెక్కచేయని స్థితిలో ఉన్నాడు. ఈనాడు రోమన్ రాజకీయాలను సమీక్షిస్తే, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉన్నది; చెప్పినా ఎవరు నమ్ముతారు? ఆక్టోవియన్ తాను చక్రవర్తి కావాలని ప్రయత్నిస్తున్నాడు. పైకి మాత్రం ‘రాజరికం’ అనే మాట వినబడదు. ‘రాజు’ అంటే ఇటలీలో ఒక పీడకల! నిన్నగాక మొన్న రాజుల శిరస్సులు తెగిన ఘట్టాలు ఇంకా అందరికీ కళ్ళకు కట్టినట్లున్నవి. అందుకని ఎవ్వరూ పసిగట్టకుండానే రాజరికాన్ని మారుపేరుతో పిలుస్తూ ఆరాధించేందుకు అతను ఆరాటపడుతున్నాడు. రాజకీయ నాయకులందరికీ ఇది బహిరంగ రహస్యంగానే వున్నది.
‘‘రోమన్ చరిత్రలో ప్రజాస్వామ్యాన్ని సాధించిన ఘట్టం సువర్ణాక్షరాలతో లిఖింపబడిందని నీకు తెలుసు. మానవుడు విశేష రక్తస్రావంతో సంపాయించిన పవిత్రమైన ఈ ప్రజాస్వామ్యాన్ని భంగపరిచేందుకు ఆక్టోవియన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇది దేశానికే అరిష్టమని వేరుగా చెప్పనక్కరలేదు.
‘‘ప్రజాస్వామ్య రక్షణకు నడుం కట్టిన నాయకులమైన మనకందరికీ ఇది తీరని అవమానం. రుూ సమయంలో మనం తొందరపడకుంటే, చివరకు అంతా నేలపాలైనందుకు పశ్చత్తాపపడవలసి వుంటుంది. ఈ క్లిష్ట సమయంలో మనం ప్రజాస్వామ్యాన్ని సంరక్షించుకుంటే, చరిత్ర తల్లకిందులై చక్రవర్తిత్వానికి దాసోహం అనవలసి వస్తుంది.
‘‘ఆక్టోవియన్‌కు తెలుసు- నీవూ, నీ మిత్రులూ అతనికి ఆటంకమని. నీ మీద యుద్ధం చేసి గెలుచుకున్నట్లయితే, తాను చక్రవర్తి కాగలడు. దీనికి అతను అనేక పథకాలు వేస్తున్నాడు.
‘‘ముఖ్యంగా నిన్ను ఎదుర్కొని నీచాతినీచంగా చిత్రించడం అతనికి దైనందిన కృత్యమైంది. నీవు రోమ్‌కు ఏ విధంగానూ సహాయపడటం లేదు సరికదా, ప్రతికూలంగా తయారై, ప్రభుత్వానే్న కూలద్రోసే ప్రయత్నాలు చేస్తున్నావని నిందిస్తున్నాడు. క్లియోపాత్రాతో జేరిపోయి, రోమన్‌వైన నీవు, ఈజిప్టుకు శాశ్వతంగా అంకితమై అంతతోటిపోక, ఆమె సహాయంతో రోమ్ మీద దండయాత్ర కోసమై సైన్యాల్ని సమకూరుస్తున్నావని ఆక్టోవియన్ బహిరంగంగా పేలుతున్నాడు.
‘‘ఈ విషయాన్ని అతను అనేక విధాల రుజూ చేస్తున్నాడు. ‘ఇపుడు ఈజిప్టు చాలా పెద్దరాజ్యమైపోయింది. రోమ్‌తో మైత్రికన్న విరోధానికే దారితీస్తున్నది. ఈనాడు రోమ్ నుంచి తనకేం ప్రమాదం వాటిల్లిందని అక్కడ సైన్యాల సమీకరణ సాగుతున్నది? పూర్వంవలె ఈజిప్టు రోమ్‌తో వ్యాపారం చేయటంలేదు. ధాన్యం సరఫరాలను సగానికి సగం తగ్గించింది. మనం తిండి గింజలకు ఈజిప్టుమీద ఆధారపడి ఉన్నామని తెలిసే, రుూ విధంగా మనకు ఇబ్బంది కలుగజేస్తున్నది. ఇది సంధి షరతులను బహిరంగంగా నిరసించటంగాక మరేవౌతుంది? ఐతే, క్లియోపాత్రాకు ఇంత సాహసం, రోమ్‌ను పరిహసించేపాటి ధైర్యం ఎక్కడివి? ఇదంతా ఏంటనీ అండ చూసుకొని లేదా అతనే వెనక ఉండటంవల్ల జరుగుతున్నది. ఈజిప్టు దురాక్రమణకు సిద్ధపడిందని నేను వేరుగా వివరించనక్కరలేదు. మొన్నీమధ్య మన నాయకుడనుకునే ఏంటనీ జయించిన ఆర్మీనియా, మెడియా దేశాలను ఆక్రమించినదెవరు? ఎవరెలా చచ్చినా ఊరుకుందామంటే, రేపు రోమ్‌ను ఆక్రమిస్తే, ఏ రోమన్ పౌరుడు తాను ఈజిప్షియన్ రాణి పరిపాలనలో ఉండేందుకు ఒప్పుకుంటాడు? ఈ ప్రమాదం రాకముందే మనం మేల్కోవాలి. ఏంటనీ మనకు శత్రువయ్యాడు. స్వదేశానికే ద్రోహం చేసేందుకు సిద్ధపడుతున్నాడు. కాదని రుజూ చేసుకోవలసిన బాధ్యత అతనికున్నది. ఐతే, అతను రోమ్‌కు ఎందుకు రాడు?.. మొహం చెల్లలేదు. చేసిన పాడు పనికి ప్రజల సమక్షంలో సంజాయిషీ చెప్పుకోగలడా?’ ఈ ధోరణిలో అతను మాట్లాడుతున్నాడు.
‘‘ఇదంతా శుద్ధ అబద్ధమని రుజూ చేసేందుకు మేమెంతో ప్రయత్నిస్తున్నాము కాని, ఆక్టోవియన్ వాదన ప్రజలకు నచ్చుతోంది. అతను చేసే సవాళ్ళను మేము ఎదుర్కోలేకపోతున్నాము. రాజకీయ యంత్రాంగమంతా అతని చేతుల్లోనే ఉండటంవల్ల అతని మాటలకే విలువ హెచ్చు.
‘‘మూడేళ్ళుగా నీవు ఆక్టోవియా మొహం చూడలేదు. కారణాలు ఏవైనప్పటికీ దంపతులు మూడేళ్ళ పాటు విడివడి ఉంటే, రోమన్ చట్టాల ప్రకారం వారికి సంబంధం ఉండదు. నోరారా చెప్పి విడాకులిచ్చేందుకు మారుగా, ఈ సులభ మార్గాన నీవు ఆక్టోవియాను విడనాడావనీ, తద్వారా సంధి షరతుల్ని అతిక్రమించావనే వాదనను ఆక్టోవియన్ లేవదీశాడు. ఆక్టోవియా లాంటి ఉత్తమ ఇల్లాలికి ఇంత అన్యాయం జరిగినందుకు ప్రజలు సహించలేకపోతున్నారు.
‘‘ఈ విధంగా ఈనాడు నీకు రోమ్‌లో మిత్రులకన్నా శత్రువులే హెచ్చయ్యారు. ఎటు చూసినా నీ వ్యక్తిత్వానికి మచ్చ ఏర్పడిందనేది దృఢమైపోయింది. ఇపుడు మన కర్తవ్యమేమిటి?
‘‘సర్వాధికార వర్గ సమావేశాలే చాలా అరుదైనవి, అధవా జరిగినా కేవలం నిన్ను క్లియోపాత్రాను ఆడిపోసుకునేందుకు తప్ప మరెందుకూ ఉపయోగపడటంలేదు. కనుక సౌమ్య మార్గాన మన మీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలగటం అసంభవంగా తోస్తున్నది.
‘‘నీవు దూర తీరాన ఉండటమే ఆక్టోవియన్‌కు గొప్ప అవకాశాన్ని కలిగించింది. అయితే, అతను చాలా పిరికివాడు కనుక, అతను చెప్పినంత విషమంగా పరిస్థితులు మారినవని అతను నమ్మినట్లు నటించి, ఇతరుల చేత నమ్మించగలిగినా, నీ మీద కానీ, క్లియోపాత్రా మీద కానీ యుద్ధాన్ని ప్రకటించలేదు. ఆ ప్రకటన కూడా నీ వొంతే అయేట్లు చూస్తే, అపుడు నిన్ను దేశద్రోహిగా ప్రజలే గుర్తిస్తారనీ, తనకు వారి సహాయ సహకార సానుభూతులుంటవనీ అతని పన్నాగం. నిన్ను ఈ వలయంలోకి లాగేందుకే అతను గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.
‘‘ఆక్టోవియన్‌కు నచ్చచెప్పి, ఆమెను ఏథెన్స్ నుంచి రోమ్‌కు తరలించాడు. ఆమెకు పిల్లల క్షేమం కన్నా మరేమీ పట్టలేదు. ఈనాటికీ నిన్ను ఆరాధ్య దైవంగానే కొలుస్తున్నది. అయితే , ఆక్టోవియన్ విడాకులీయబడిన అభాగ్యురాలిగా ఆమెను ప్రపంచానికి చూపుతున్నాడు.
‘‘నిన్ను రెచ్చగొట్టేందుకు, నీ ఆస్తిపాస్తుల్ని ప్రభుత్వపరం చేస్తున్నాడు.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు