డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమన్ పాలకుడిగా మోసగింతువుగాక! నేను మారానన్నావే- అది నిజం ఏంటనీ! నేనిప్పుడు ముగ్గురు పిల్లల తల్లిని.. నాకు మరి ఎన్ని బాధ్యతలుంటవో ఆలోచించు’’ అన్నదామె.
‘‘నన్ను నమ్మవా రాణీ! నిజంగా నేను కవలల్ని చూడాలని ఎంత తహతహలాడానో తెలుసా?’’ అన్నాడు ఏంటనీ.
‘‘తెలుసు.. కానీ, మధ్యధరా సముద్రానికి ఒక తీరాన నిలబడి రెండో తీరాన వున్న పిల్లల్ని చూసి లాభమేమిటి? కనిపిస్తారా? ఐనా, వాళ్ళు నా పిల్లలు.. కనుక నీకు వాళ్ళమీద మమకారం ఉండవలసిన అవసరం మాత్రం ఏమున్నది?’’
ఏంటనీ కళ్ళు చెమ్మగిల్లినవి. తాను చేజేతులా రుూ దేవత అనుగ్రహాన్ని పాడుచేసుకోవటమేగాక, ఆమె ఆగ్రహానిక్కూడా గురయ్యాడు. ఆమె పలుకులు వాడి ములుకులైనవి.
గద్గదస్వరంతో అన్నాడు: రాణీ! నన్ను నమ్ము.. నేను నిజం చెపుతున్నాను. ఆక్టోవియాను వివాహమాడటం నాకసలు ఇష్టంలేదు. పుల్వియా మరణంతో మనిద్దరిమధ్యా మరణ దేవత మినహా మరొక అడ్డంకి లేనందుకు సంతోషించాను. కాని, ఆక్టోవియాను రాజకీయ కారణాల వొత్తిడితో పెళ్లాడక తప్పలేదు.’’
‘‘నేనేమన్నాననీ- అంత విచారపడేందుకు? మీరు సర్వ స్వతంత్రులు. తుమ్మెదను పూవు పేరు పెట్టి పిలవాలా? అది తన ఇష్టానుసారంగా మధువును గ్రోలుతుంది. దాన్ని అడ్డేదెవరు?’’
‘‘రాణీ! నేను అంత నీచుణ్ని కాదు. నీ పట్ల విశ్వాసహీనంగా ప్రవర్తించలేదు.. కాని రాజకీయాలు ఎంత క్రూరంగా వుంటవో, వాటి వేడికి మనిషి ఆకారమూ, ప్రవర్తనా ఎలా మారిపోవలసి వుంటుందో నేనీనాడు నీకు కొత్తగా చెప్పక్కర్లేదు’’
‘‘అందుకనే నేనేమీ సంజాయిషీ కోరటంలేదు. నీ అంతట నీవే అంతా చెప్పావు. చెప్పావు కదానని విన్నాను. చెప్పక్కర్లేదనేందుకు సంస్కారం అడ్డొచ్చింది కనుక ఊరుకున్నాను. ఒకవేళ నేను ఏమైనా తప్పు చేస్తే తెలియపరుచు’’ అన్నదామె.
ఏంటనీ గొంతులో వెలక్కాపడినట్లయింది. ఆమె తననేమీ అనకుండటమే అతనికి బాధగా వున్నది.
‘‘రాణీ! నేనేమని చెప్పుకొనేది? నాకు తెలియక ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమిచమని వేడుకుంటున్నాను!’’ అన్నాడు ఏంటనీ ఇంకేమీ తోచక.
‘‘చాలా చిత్రంగా మాట్లాడుతున్నావ్! మీరు రోమన్‌లు! పాలకులు. మీరు ఒకవేళ తప్పులు చేసినా చెల్లుతవి. సామంతులమైనా నా బోటివారు, అందునా అబల, అనాథ- తప్పులు చేస్తే శిక్షించే అధికారం మీకున్నది. మీ తప్పులక్కూడా మేమే శిక్ష అనుభవించాలి కదా! అలాంటప్పుడు మీరేం తప్పులు చేశారనీ రుూ క్షమాపణ?’’
‘‘రాణీ! నేను నీకంత దూరమైపొయ్యానా?’’
‘‘ఎప్పుడో తెలిసో, తెలియకో దగ్గరయ్యామనుకో.. ఐనా మధ్యధరా సముద్రతీరాలు దగ్గిరైతే, భూ వలయాకారమే మారుతుంది కదా!’’
ఏ విధంగా మాట్లాడాలో అతనికి తోచడంలేదు. తనమీద తనకు మండిపోతోంది.
‘‘ప్రియా!’’ అన్నాడు అడ్డతోవ పట్టిద్దామని.
క్లియోపాత్రా గ్రహించింది. ఈ మగవాళ్ళకు ఒక్కసారి లొంగుతే చాలు- స్ర్తిని ఏ స్థితిలో ఉన్నప్పటికీ లోబరచుకోవటానికి వేరే మార్గాలు అవసరం లేదు.
‘‘ఏంటనీ! నేను నీకేవౌతానని ఎన్నడన్నా ఆలోచించావా? ఇప్పుడు తిరిగి ఇటు వచ్చావు. కొన్నాళ్ళు సాగిన స్నేహాన్ని పురస్కరించుకొని, మొహం తప్పిస్తే బాగుండదని నన్ను ఆహ్వానించావు. నీ ఆహ్వానాన్ని తోసిపుచ్చి ఉండవలసింది. ఎందుకంటే నీ అవసరాలనేవి నినే్న నా దగ్గరికి లాక్కొచ్చి వచ్చేవి.. ఇదంతా తెలిసి కూడా రోమ్ పట్ల నాకుండే గౌరవాభిమానాలను పురస్కరించుకొని ఇక్కడికి వచ్చాను. ఇక ఇక్కడ నన్ను పిలవనంపిన కారణమేమిటో చెప్పకుండా, నన్ను ప్రియా అంటూ పిలిచేందుకు నీకెలా మనసొచ్చింది? ఇది నన్ను అగౌరవించటంగా భావిస్తున్నాను!’’ అన్నదామె నిప్పులు కురిసే కంఠస్వరంతో.
‘‘రాణీ! నీవింత కఠినమైపోతావనుకోలేదు’’ అన్నాడు ఏంటనీ.
‘‘నేను మాత్రం అనుకున్నానా- నీవిలా అవుతావని? అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతయ్యా?’’
‘‘మళ్లీ చెపుతున్నాను రాణీ! నేను మనోవాక్కాయ కర్మణా నినే్న ప్రేమించాను. ఇతర స్ర్తిలను ఎరగని పవిత్రుణ్ణని చెప్పుకోలేను కాని హృదయమంటూ ఇచ్చింది నీకే!’’
క్లియోపాత్రా నవ్వింది: ‘‘ఇలాంటి మాటలు ఎంతమందికి చెప్పి ఉంటావో నాకు తెలియదు.. ఏంటనీ! ఈ ప్రపంచం పుట్టి ఎన్నాళ్లయిందో మనకు తెలియదు. దాని చరిత్ర ఏమిటో కూడా పరిపూర్ణంగా తెలియదు.. కాని, ఒకటి మాత్రం నిజం. ప్రతి పురుషుడూ తనకు కావాలనుకున్న స్ర్తి దగ్గర రుూ విధంగానే మాట్లాడి ఉంటాడు. తాను నిజంగా ప్రేమించింది ఆమెనే అంటాడు. అలా అనటం ఒక రివాజేమో తెలియదు. లేక ఆ క్షణంలో నిజంగా ఆమెనే ప్రేమిస్తున్నట్లు అతను భ్రమిస్తాడేమో కూడా తెలియదు. కాని, ఒకటి మాత్రం నిజం- ఆమె వెంటనే నమ్ముతుంది. మోసపోతుంది. ఈ విధంగా స్ర్తి ఎప్పుడూ పురుషుని మోసకారితనానికి గురవుతూనే వుంది. చరిత్ర ఎలా వున్నా ప్రాపంచిక ధర్మం మాత్రం ఇదే! ఇప్పుడే కాదు.. ఇక ముందు కూడా స్ర్తిజన్మ పురుషజన్మకు మోసపోక తప్పదు. అందుకని నన్ను మళ్లీ వలలో వేసేందుకు ప్రయత్నించకు.. నాక్కూడా కొద్దో గొప్పో అనుభవమున్నది కదా!’’ అన్నదామె.
రాణి తనమీద అలిగిందని ఏంటనీ తేల్చుకున్నాడు. తనను తాను ఒక మూర్ఖుడుగా రుజువు చేసుకున్నాడు! ఇప్పుడిక ఏం మాట్లాడినా ఆమె వినిపించుకొనే స్థితిలో లేదు. దురదృష్టదేవత తనను వెన్నాడుతోంది. ఇంకా ముందుకు సాగినందువల్ల ప్రయోజనము ఉండేట్లు తోచలేదు. ఇంకోనాడు మాట్లాడుదామని నిశ్చయించుకున్నాడు ఏంటనీ.
‘‘రాణీ! నామీద కినుక వహించావు. ఇది నీ విశ్రాంతి సమయం. ఇప్పుడు ఏం చెప్పినా నీకు విసుగ్గానే ఉంటుంది.. మరోనాడు వస్తాను’’ అని ఆమె జవాబు వినకుండానే ఏంటనీ బయటపడ్డాడు.
తీరా బయటికి వచ్చాక, తాను పెద్ద పొరపాటు చేశానని గ్రహించాడు. ఎందుకంటే, ఆ వేడిలో ఆమె పెట్టదలచుకున్న నాలుగు చీవాట్లు తింటే, ఈ గొడవ ఇంతతో అంతమయ్యేది. ఆ తరువాతన్నా కాస్త ప్రశాంతంగా ఉండేది. తాను రేపిన తుఫాను మధ్యలోనే తనకు భయం వేసి తిరిగొచ్చాడు. రెండోసారి తిరిగి ఇదంతా మొదలుకావలసిందే! ఇప్పుడు విచారపడి లాభమేమిటి?
క్లియోపాత్రా నిజంగానే తననిప్పుడు ప్రేమించటంలేదేమో? ఈ ఆలోచన రాగానే ఏంటనీ కంపించాడు. క్లియోపాత్రా లేకుండా తాను మరి బతకలేననే భయం ఉన్నది. ఈ పర్షియన్ దండయాత్రంతా బూటకం. శ్రమ పడకుండానే సుఖపడదామనే ఆశతో తానిక్కడికి ఉరుకులు పరుగులతో వచ్చాడు.
కాని, ఇక్కడ క్లియోపాత్రా కొరకరాని కొయ్యగా మారిపోయింది. ఆమె అలుగుతుందని ముందే ఊహించాడు. కాని ఇంత కఠింనగా ఉంటుందనుకోలేదు. మరొక్కసారి గట్టిగా ప్రయత్నం చేయాలి. చారుల్ని పెట్టి, రాణి కాస్త ఉత్సాహంగా ఉన్న సమయంలో తనకు వెంటనే చెప్పమని ఆదేశించాడు.
ఈ సంఘటనలతో ఏంటనీకి మతిపోయింది. క్లియోపాత్రా ఆదరించకుంటే, తూర్పు దేశాల్లో తనకు స్థానం లేదు. ఈజిప్టును ఆక్రమించుకోవలసి వుంటుంది. తనకామె ఏణ్ణర్థంగా భార్యకన్నా ఎక్కువగా మెలిగింది. తనకు సంతానాన్ని కన్నది. అలాంటి రాణిమీదనా తాను యుద్ధాన్ని ప్రకటించేది!
చివరకు రోమన్ ప్రభుత్వం తనను కదనరంగంలోకి దూకమని ఆజ్ఞలిచ్చినా, ఈజిప్టుమీద మాత్రం కత్తి దూయలేదు. చివరకు ఆమె కాళ్ళమీద పడయినా సరే, ఆమె అనురాగాన్ని తిరిగి సంపాయించాలి. రసికుడైన తనకు తెలుసు- ప్రియురాలు అలిగినప్పుడు, ఆమె ప్రేమను పొందేందుకు, ఆమె సానుభూతిని పొందటంకన్నా అడ్డతోవ ఉండదని.

- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు